ysrcp mlas protest in andhra pradesh assembly

Ycp protest over removal ys rajashekar reddy photo in assembly

ycp protest over removal ys rajashekar reddy photo in assembly, ysrcp mlas protest, andhra pradesh assembly, former chief minister late ys rajashekar reddy, ap assembly session, ysr photo, ysrcp protest

ysrcp mlas protest in andhra pradesh assembly over removal of former chief minister ys rajashekar reddy photo in assembly

వైఎస్ ఫోటో తొలగింపుపై దద్దరిల్లిన అసెంబ్లీ..

Posted: 09/02/2015 09:53 AM IST
Ycp protest over removal ys rajashekar reddy photo in assembly

స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్డర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతిని పురస్కరించుకుని ఆయన ఫోటోను అసెంబ్లీ లాంజ్ లో నుంచి తొలగింపుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసనకు దిగారు. అసెంబ్లీ లాంజ్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఫోటో తొలగింపుపై ఆందోళన చేపట్టారు. వైఎస్ఆర్ జోహార్ అని నినాదాలు చేస్తూ.. ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే వైఎస్ఆర్ ఫోటో తిరిగి పెట్టాలని వారు డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి వైఎస్ చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని తక్షణం అసెంబ్లీలో ఆయన ఫోటోను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ వైసీపీ సభ్యులను ఆందోళన విరమించి వారివారి స్థానాల్లో కూర్చోవాలని సూచించారు. అయినా వైఎస్ఆర్ సీపీ సభ్యులు తమ పట్టు వీడలేదు. సభలో ఏదైనా అంశంపై చర్చకు రావాలంటే ...వాయిదా తీర్మానం ద్వారానో, మరోద్వారానో రావాలని స్పీకర్ అన్నారు. కరువు, తాగునీటిపై వాయిదా తీర్మానం ఇచ్చిన వైఎస్ఆర్ సీపీ ...ఆ విషయాన్ని వదిలేసి వైఎస్ఆర్ ఫోటో తొలగింపుపై చర్చకు పట్టుపట్టడం సరికాదన్నారు. పెద్ద పెట్టున వైసీపీ సభ్యులు నినాదాలు చేయడంతో.. సభలో గంధరగోళం ఏర్పడింది. దీంతో స్పీకర్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : ap assembly session  ysr photo  ysrcp protest  

Other Articles