Prime Minister Narendra Modi Given Bumper Offer To UnEmployees | Job Interview Process | Low Category people

Prime minister narendra modi bumper offer unemployees no interview process

narendra modi, unemployees persons, jobs process, interview process, narendra modi man ki baat, man ki baat programme, narendra modi controversies, govt jobs, indian unemployees, jobs notifications, jobs recruitments

Prime Minister Narendra Modi Bumper Offer UnEmployees No Interview Process : Indian Prime Minister Narendra Modi Given Bumper Offer To UnEmployees. He Says Their Govt Making Plans To Remove Interview Process For Low Category Jobs.

నిరుద్యోగులకు మోదీ బంపరాఫర్.. ‘నో ఇంటర్వ్యూ’!

Posted: 08/31/2015 11:31 AM IST
Prime minister narendra modi bumper offer unemployees no interview process

‘ఏం నాయనా.. లడ్డూ కావాలా?’ అని ఎవరైనా మనల్ని ఆఫర్ చేస్తే ఏం చేస్తాం.. వెంటనే ఆ లడ్డూని లాక్కొని లపక్ మని నోట్లో వేసుకుంటాం. ఆ తరహా ఆఫరే ప్రధాని నరేంద్రమోడీ నిరుద్యోగులకు అందజేస్తున్నారు. ఇన్నాళ్లూ ఉద్యోగాల కోసం నిద్రహారాలు మానేసి, రాత్రింబవళ్లు వెంపర్లాడిన వారికి మోదీ ఓ మార్గాన్ని సులభం చేశారు. ఉద్యోగాలు పొందే ప్రక్రియలో భాగంగా నిర్వహించే ‘ఇంటర్వ్యూ’ విధానాన్ని తొలగించనున్నట్టు మోడీ స్వయంగా ప్రకటించారు.

ఇకనుంచి కిందిస్థాయి ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూలు వుండవని, దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రెండు వారాల్లో విడుదల చేయనున్నామని మోదీ పేర్కొన్నారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ‘కిందిస్థాయి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు అవసరమా?’ అని ప్రశ్నించిన ఆయన.. ఇప్పుడు తాజాగా ‘మన్ కీ బాత్’లో ఇంటర్వ్యూలను తొలగించాలని భావిస్తున్నట్లు తెలియజేశారు. ఈ ప్రక్రియను తొలగించడం వల్ల నిరుద్యోగులకు ఓ మార్గం సులభం కావడంతోపాటు మరో ప్రయోజయం కూడా వుంది. అందులో భాగంగానే ఈ ప్రక్రియను తొలగించనున్నట్లుగా ఆయన అభిప్రాయపడ్డారు.

సాధారణంగా ఇంటర్వ్యూలకు రమ్మని పిలవగానే.. వెంటనే నిరుపేద నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు సిఫార్సులు, సహాయం కోసం పరుగులు పెట్టడం వల్ల అవినీతికి ఆస్కారం ఏర్పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంటర్వ్యూలో తొలగిస్తే.. అవినీతి జరగదని మోడీ వివరించారు. ఏదేమైనా.. ఈ ఇంటర్వ్యూ ప్రక్రియను తొలగించనున్నట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో.. నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారని సమాచారం.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  interview process  Govt Jobs  

Other Articles