union minister dattatreya struck inside lift

Central minister got struck in lift at hyderabad

union minister bandaru dattatreya, union minister, bandaru dattatreya, bandaru, dattanna, bandaru struk in lift, book launch programme, hyderabad, Amit shah

After Amit shah struck inside lift at patna, now union minister bandaru dattatreya strucks inside lift at a book launch program in hyderabad

అమిత్ షా తరువాత కేంద్ర మంత్రి చిక్కుకున్నారు..!

Posted: 08/30/2015 04:35 PM IST
Central minister got struck in lift at hyderabad

బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజధాని పాట్నాలో కొద్దిరోజుల కిందట బీజేపీ జాతియ అధ్యక్షుడు అమిత్ షాకు ఎదురైన సంఘటనే తాజాగా ఇవాళ కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రికి హైదరాబాదులో ఎదురైంది. పార్టీ అగ్రశేణి నాయకులతో కలసి ఆయన తన రూమ్ కు వెళ్తున్న క్రమంలో లిప్టులో చిక్కకున్నారు. ఇప్పుడు తాజాగా అదే ఘటన కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయకు ఎదురైంది. ఆయన కూడా ఇవాళ లిఫ్టులో చిక్కుకుపోవడంతో ఆయన భద్రతా సిబ్బందితో పాటు బీజేపీ కార్యకర్తలకు ముచ్చెమటలు పట్టించింది.

వివరాల్లోకి వెళ్తే.. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ కాచీగూడాలోని ఓ భవంతికి వెళ్లిన దత్తాత్రేయ వేదిక వద్దకు చేరుకునేందుకు లిఫ్టు ఎక్కారు. ఆయన లోపలికి ప్రవేశించిన తర్వాత కొద్దిగా కదిలిన లిఫ్ట్.. రెండు అంతస్తుల మధ్య ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో ఆందోళనకు గురైన పోలీసులు కాసేపటి తర్వాత లిఫ్టును తెరవగలిగారు. కేంద్ర మంత్రి సురక్షితంగా బయటికి వచ్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పాట్నాలో అమిత్ షా తరువాత.. బండారు దత్తత్రేయకు ఇలా జరగవంతో ఆయన తరువాత దత్తన్న వంతు వచ్చిందని పలువురు అందోళన చెందారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bandaru dattatreya  lift  book launch programme  hyderabad  Amit shah  

Other Articles