Court Orders Probe Into Police Action | Gujarat |Police

Court orders probe into police action in ahmedabad

Gujarat, Hardik Patel, Reservation, Patel protest, Gujarat Police, Gujarat High Court

Court Orders Probe Into Police Action in Ahmedabad The Gujarat High Court has issued notice to the Ahmedabad police chief, asking him to probe alleged police excesses during Tuesday's protest by the Patel community over reservation. The court has given him two weeks to finish his probe.

మీరే ఇలా చేస్తే ఎలా..? పోలీసులకు కోర్టు అక్షింతలు

Posted: 08/28/2015 08:04 AM IST
Court orders probe into police action in ahmedabad

శాంతి భద్రతలను కాపాడవలసిన రక్షకులా లేక మీరు అల్లర్లు, విధ్వంసక చర్యలకు పాల్పడి ప్రజల జీవితాలతో చెలగాటమాడేందుకు వచ్చిన భక్షకులా ? అంటూ గుజరాత్‌ పోలీసు బలగాలను రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా మందలించింది. అహ్మదాబాద్‌లో పటేల్‌ వర్గం జరిపిన భారీ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల అనంతరం ఒక కాలనీలోకి ప్రవేశించిన పోలీసులు ఇష్టారాజ్యంగా ప్రదర్శించిన దౌర్జన్యాలు, అమానవీయ ప్రవర్తకు సంబంధించిన సిసిటివి ఫుటేజ్‌లను పరిశీలించిన తరువాత హైకోర్టు ఇలా తన ఆగ్రహాన్ని వ్యక్తంచేసింది. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి రెండువారాల లోగా నివేదిక అందించాలని పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు డైరెక్టర్‌ జనరల్‌కు, సిటీ పోలీసు కమిషనర్‌కు, సంఘటన చోటుచేసుకున్న సోలా పోలీసు స్టేషన్‌ ఇన్‌చార్జికి నోటీసులు జారీచేసింది.

నగరంలోని ఒక ప్రైవేటు కాలనీలోనికి సుమారు 40 మంది పోలీసులు ఆగస్టు 25న ఒక్కసారిగా చొరబడి అక్కడి జనాలను భయభ్రాంతులకు గురిచేస్తూ గాలిలోకి కాల్పులు జరిపారు. బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఒక పక్కన పార్కింగ్‌ చేసి ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసుల అతి ప్రవర్తనపై ఇద్దరు న్యాయవాదులు విరాట్‌ పోపట్‌, తీర్థ దావెలు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అనుమతి లేకుండా ప్రైవేటు కాలనీలోకి చొరబడడమే కాకుండా విధ్వంసానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన తమ ఆస్తిపాస్తులకు పరిహారం ఇప్పించాలని వారు కోర్టును ఆశ్రయించారు. తమ వాదనకు సాక్ష్యంగా సిసిటివి ఫుటేజీలను వారు కోర్టు ముందు ఉంచారు. వాటిని పరిశీలించిన జస్టిస్‌ పార్థివాలా పోలీసుల అతిపై కఠినపదజాలంతో తన ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు.

 ''ఇలా అడ్డూ అదుపూ లేకుండా పోలీసు బలగాలు వ్యవహరిస్తే ప్రజలకు ఎలాంటి సందేశం చేరుతుంది ? ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను పోలీసులే ఇలా ధ్వంసంచేయడాన్ని ప్రభుత్వంలోని ఉన్నత వర్గాలు తీవ్రమైనదిగా గుర్తించాలి. తగిన చర్య తీసుకున్నప్పుడే ప్రజలకు పోలీసులపైనా, పాలకులపైనా విశ్వాసం మళ్లీ ఏర్పడుతుంది.'' అని ఆయన వ్యాఖ్యానించారు. ఏ కారణం లేకుండానే తమ కాలనీలోకి ప్రవేశించిన పోలీసులు నాలుగు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఆస్తులను ధ్వంసం చేశారు. ఇదంతా విధ్వంసక చర్యలను నివారించే ప్రయత్నం అంటూ ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారు. పౌరుల కనీస హక్కులను కాలరాశారు. పోలీసుల ప్రవర్తన అధికార దుర్వినియోగమే తప్ప మరేమీ కాదని పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని వారు కోరారు. వారి వాదనలను పరిశీలించిన తరువాత కోర్టు ఈ మేరకు ఆదేశాలను ఇచ్చి విచారణను రెండు వారాలు వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gujarat  Hardik Patel  Reservation  Patel protest  Gujarat Police  Gujarat High Court  

Other Articles