A Pshycho Giving Injections To Women In West Godavari District | Police Investigation

West godavari injection psycho women target police investigation

west godavari psycho, injection psycho, psycho inject women, police investigations, crime news, women crime news, psycho targets women

West Godavari Injection Psycho WOmen Target Police Investigation : A Pshycho Giving Injections To Women In West Godavari District.

స్త్రీలకు ఇంజెక్షన్ ఇస్తున్న ఆ ‘పిశ్చి’మ ఉన్మాది ఎవరు?

Posted: 08/26/2015 11:24 AM IST
West godavari injection psycho women target police investigation

కొందరు దుండగులు తమ పైశాచికత్వాన్ని పలురకాలుగా ప్రదర్శిస్తుంటారు. ఆ మధ్య ఓ సైకో వరుస హత్యలు చేసుకుంటూ తీవ్ర కలకలం సృష్టించగా.. మరొకడేమో రాత్రి సమయంలో మహిళల్ని భయపెట్టించేవాడు. ఇలా రకరకాల సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఓ సైకో మరో విధంగా తన పైశాచికానందాన్ని పొందుతున్నాడు. ఒంటరి మహిళల్ని లక్ష్యంగా చేసుకుని, వారి శరీరంపై ఓ ఇంజక్షన్ గుచ్చి పరారవుతున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో కలకలం సృష్టిస్తున్నఈ సైకో బారిన పడ్డ మహిళల సంఖ్య తొమ్మిదికి చేరింది.

ఎటువైపు నుంచి వస్తాడో తెలియదు కానీ.. బైకుపై ముఖానికి మాస్క్ ధరించిన ఓ దుండగుడు ఒంటరిగా వున్న మహిళల్ని లక్ష్యం చేసుకుని, వారి శరీరంపై ఓ ఇంజక్షన్ గుచ్చి పరారవుతాడు. ఆపై ఆ మహిళకు మత్తు వస్తుంది. అంతే! దుండగుడు దోపిడీ చేయడం లేదు. కేవలం ఇంజక్షన్ ఇచ్చి పారిపోతున్నాడు. కాలేజీల్లో చదివే అమ్మాయిలు, యువతులే లక్ష్యంగా ఇంజక్షన్లు ఇచ్చి పారిపోతున్నాడు. అతను ఎందుకు ఇలా చేస్తున్నాడో పోలీసులకూ అంతు చిక్కడం లేదు. ఇతనిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నప్పటికీ, దొరకడం లేదు. దుండగుడి లక్ష్యం ఏంటో, ఎందుకిలా చేస్తున్నాడో ఇప్పటికీ అంతు చిక్కలేదు.

మరోవైపు.. ఈ కేసును తాము సీరియస్ గా తీసుకున్నామని పోలీసులు చెబుతున్నప్పటికీ, ఇంతవరకూ అసలా ఇంజక్షన్ ద్వారా శరీరంలోకి ఏం వెళుతున్నదన్న విషయం కూడా తేల్చలేదు. గత మూడు రోజుల నుంచి వరుసగా ఈ ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా పోలీసులు గట్టి నిఘా పెట్టి సాధ్యమైనంత త్వరలో ఉన్మాదిని పట్టుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : west godavari psycho  psycho inject women  

Other Articles