new survey reveals that city teens encounter first sex at the age of 14

City teens now have their first sexual encounter at the age of 14 reveals new survey

city teen, teen exposure to sex, sex education, teen boys, teen girls, first sex encounter, first sex intercourse, new survey, sexual contact, Lifestyle News: Get the latest Lifestyle News about Fashion Tips or Fashion Trends, Beauty Tips, Fitness Tips for Men, Fitness Tips for

According to a report in Times of India, a survey in cities concluded that the average age of first sexual contact for boys was 13.72 years and 14.09 years for girls.T

14 ఏళ్లకే సెక్స్ లో్కి అడుగిడుతున్న నగర బావిపౌరులు

Posted: 08/25/2015 11:27 PM IST
City teens now have their first sexual encounter at the age of 14 reveals new survey

భారత దేశంలో విద్యావ్యవస్థలోనే సమూల మార్పులు చేయాలని, నేటి విద్యార్థులకు సెక్స్ ఎడ్యూకేషన్ గురించి కూడా అవగాహనా తరగులను పాఠశాలల్లో నిర్వహించాలన్న డిమాండ్లు అనేకం తెరపైకి వచ్చినా.. అవి కార్యరూపం దాల్చలేదు. అందుకు కారణాలు అనేకం వున్నా.. తెలిసీ తెలియని వయస్సులోనే పిల్లలకు ఆ విషయంలో అంత అవగాహన ఎందుకని పెద్దలు అభ్యంతరాలు వ్యక్తం చేయడం మాత్రం పెద్ద కారణం. అయితే ఈ విషయంలో అందరు తల్లిదండ్రులు తమ పిల్లలు చిన్నవారని వారికేం తెలియదని వాదించడంలో ముందుంటారు.

 అయితే తాజాగా వెలుగు చూసిన సర్వే మాత్రం నగరాలలోని పిల్లలు యుక్త వయస్సుకు రాకముందే సెక్స్ విషయంలో అవగాహన వస్తుందని కాగా కొందరు అదే వయస్సులో తొలి అనుభవంలోకి దిగుతున్నారని స్పష్టం చేస్తుంది. వీరిలో బాలలు సుమారుగా 14 ఏట సెక్స్ అనుభవంలోకి దిగుతుంటే.. బాలికలు మాత్రం రమారమి అదే వయస్సులో అయితే పదిహేను ఏళ్లు పూరైన తరువాత సెక్స్ అనుభవాన్ని తొలిసారిగా చూస్తున్నారని తెలుస్తుంది. ఒక జాతీయ దినపత్రిక (టైమ్స్ అఫ్ ఇండియా) నివేదిక ప్రకారం సుమారుగా 20 నగరాలలో 15 వేలకు పైగా యుక్తవయస్సులోకి వస్తున్న బాలబాలికలను ఇంటర్వ్యూ చేయగా ఈ విస్మయం గోలిపే విషయాలు బయటపడ్డాయని సమాచారం.

ఈ సర్వేలో పాల్గోన్న వారిలో సుమారుగా 9 శాతం మంది తమకు సెక్సు వల్ల కలిగే ఇన్ ఫెక్షన్ బారిన ఒకసారైనా పడినట్లు తెలుస్తుండగా, 6.3 శాతం మంది బాలురు, 1.3 శాతం మంది బాలికలు అదే వయస్సులో సెక్సులో కనీసం ఒక్కసారైనా పాల్గోన్నట్లు తెలిపారని నివేదిక స్పష్టం చేస్తుంది. తొలిసారిగా సెక్సు అనుభవాన్ని పొందిన వారిలో బాలురు వయస్సు సగటున 14 ఏళ్లుగా నమోదు అవ్వగా, బాలికల వయస్సు సగటున 16 ఏళ్లుగా నమోదయ్యిందని నగర అధారిత ఈ హెల్త్ కేర్ సెంటర్ కంపెనీ మెడీ అంజిల్స్ వైద్యులు డాక్టర్ దేబ్రాజ్ షోమీ అన్నారు.

ఈ సంస్థ చేత కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ సర్వే నిర్వహింపజేసింది. ఈ నివేదిక ద్వారా నగర బాలబాలికలు సెక్సుకు వారి వయస్సుకన్నా వేగంగా ఎక్స్ పోజ్ అవుతున్నారని స్పష్టం అవుతుందన్నారు. ఇందుకు వారికి సెక్స్ ఎడ్యూకేషన్ పై అవగాహన లేకపోవడమే కారనహని ఈ నేపథ్యంలో సెక్స్ ఎడ్యూకేషన్ అవరసమని, యుక్తవయస్సులో ఏమీ చేయకూడదన్న విషయాలపై జాగ్రత్తలు వారి చెప్పాల్సిన అవశ్యకత వుందని వారు అంటున్నారు

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : city teen  sex exposure  new survey  sexual contact  

Other Articles