AP | Chandrababu Naidu | Narendra Modi | Special status

Ap cm chandrababu naidu will meet pm narendra modi today

AP, Chandrababu Naidu,Narendra Modi, Special status, Modi, Delhi, Grants, Funds

AP CM Chandrababu naidu will meet Pm Narendra Modi today. Chandrababu prepared to discuss about the special status and grants for ap.

మోదీతో హోదా మీద ప్రకటన చేయిస్తారా..? లేదా..?

Posted: 08/25/2015 09:06 AM IST
Ap cm chandrababu naidu will meet pm narendra modi today

రాష్ట్ర విభజన సమయంలో ప్రకటించిన ప్రత్యేక కేటగిరీ రాష్ట్ర హోదాకు బదులుగా కేంద్ర ప్రభుత్వం ఇస్తామంటున్న ప్రత్యేక ప్యాకేజీ లేదంటే ప్రత్యేక హోదా మీద నేడు ఓ క్లారిటీ రానుంది. విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రత్యేక హోదాను సాధించే అంశంపై రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర ఆర్థిక, హోం మంత్రులతో మరికొద్ది సేపట్లో భేటీ కానున్నారు. ఈ కీలక భేటీ తర్వాత ఈ విషయంలో కొంత స్పష్టత వస్తుందని రాజకీయ, అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పద్నాలుగవ ఆర్థిక సంఘం సిఫార్సుల అమలు తర్వాత దేశంలో కొత్తగా ఏ రాష్ట్రానికీ ప్రత్యేక కేటగిరీ హోదా కల్పించే సమస్యే లేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సందర్భాలలో స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రత్యేక హోదా హామీకి కేంద్రం కట్టుబడి ఉండాల్సిందేనని పట్టుబట్టనున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకొన్నది.

ఈ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలో పొందుపరచాల్సిన అంశాలపై కేంద్ర ఆర్థిక శాఖతో పాటు వివిధ మంత్రిత్వశాఖల ఉన్న తాధికారుల స్థాయిలో ఇప్పటికే కసరత్తు ప్రారంభ మైందని, ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చల అనంతరం రాజకీయ నేతృత్వ స్థాయిలో ఆమోదం లభించిన తర్వాత అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశముందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు వివరిస్తున్నాయి. అతిత్వరలో శాసనసభ ఎన్నికలు జరుగనున్న బీహార్‌ రాష్ట్రానికి ప్రధాని మోడీ కొద్దిరోజుల క్రితం ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీ మాదిరిగానే ఏపీ ప్యాకేజీ కూడా ఉండవచ్చునని చెబుతున్నారు.

మోదీతో బాబు భేటీలో ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజానీకంలో నెలకొన్న భావో ద్వేగాలను, రాజకీయంగా మిత్రపక్షాలు రెండింటికీ ఎదురౌతున్న సమస్యలను వివరించవచ్చునని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రత్యేక కేటగిరీ రాష్ట్ర హోదాను కల్పించడం సాధ్యం కాదంటూ కేంద్రం నుండి ఎలాంటి స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం లేదని, ప్రత్యేక హోదా సాధ్యాసాధ్యాలపై మరింత లోతుగా అధ్యయనం జరగాల్సి ఉందనే పేరుతో ప్రస్తుతానికి ఆ అంశాన్ని పక్కనబెట్టి రాష్ట్రానికి అందజేయాల్సిన ప్రత్యేక ఆర్థిక సహాయంపైనే దృష్టిని కేంద్రీకరిస్తు న్నట్లు ముఖ్యమంత్రికి నచ్చజెప్పే ప్రయత్నం చేయనున్నట్లు వెల్లడైంది. రాష్ట్రానికి ప్రకటించనున్న ఆర్థిక ప్యాకేజీ మొత్తం కూడా బీహార్‌ ప్యాకేజీ మాదిరిగానే భారీగా ఉండవచ్చునని, ఇందులో సింహభాగం ఏపీ కొత్త రాజధాని నగర నిర్మాణానికి కేంద్రం నుండి అందనున్న నిధుల రూపంలో ఉండ వచ్చునని అధికార వర్గాల అంచనా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  Chandrababu Naidu  Narendra Modi  Special status  Modi  Delhi  Grants  Funds  

Other Articles