A Man Named Rajaram Bavkar Broke 7 Hills To Make Road To His Village Gundegaon In Ahmed Nagar District Maharashtra

Rajaram bavkar broke 7 hills to make road to his village gundegaon

rajaram bavkar, dasarath manjhi, rajaram bavkar biography, mountain man, rajaram mountain man, rajaram broke 7 hills, manjhi the mountain man, gundegaon, maharasthra, ahmed nagar district

Rajaram Bavkar Broke 7 Hills To Make Road To His Village Gundegaon : A Man Named Rajaram Bavkar Broke 7 Hills To Make Road To His Village Gundegaon In Ahmed Nagar District Maharashtra. He Spend His Salary And Retirement Money For This.

‘మాంఝీ’లాగే 7 కొండలను పిండేసి రోడ్డేసిన రాజారాం

Posted: 08/24/2015 06:57 PM IST
Rajaram bavkar broke 7 hills to make road to his village gundegaon

బీహార్ లోని గయ జిల్లాలో గెహలూర్ గ్రామానికి చెందిన దళిత కూలీ దశరథ్ మాంఝీ.. 22 ఏళ్ల పాటు నిర్విరామంగా ఓ కొండను తవ్వి గ్రామానికి రోడ్డు వేసి చరిత్ర సృష్టించాడు. ఇతని జీవితగాధ ‘మాంఝీ - ది మౌంటెన్ మేన్’ పేరిట సినిమాగా రూపొందించిన సంగతి కూడా తెలిసిందే! మాంఝీలాగే మరో వ్యక్తి మహారాష్ట్రలో వున్నాడు. అహ్మద్ నగర్ జిల్లా గుండెగాన్ గ్రామానికి చెందిన రాజారాం బావ్ కర్ (84) అనే వ్యక్తి.. 57 ఏళ్లపాటు 7 కొండలను తవ్వి 40 కిలోమీటర్ల రోడ్డును నిర్మించి, సరికొత్త సంచలనం సృష్టించాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజారాం అప్పట్లో ఏడోతరగతి వరకు చదువుకున్నారు. అయితే.. అపారమైన తెలివితేటలు కలిగిన ఈయన.. తన మేధోశక్తితో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించాడు. జిల్లా పరిషత్ పాఠశాలలో 34 ఏళ్లపాటు ఆ ఉద్యోగంలో కొనసాగాడు. సామాజిక స్పృహ కలిగిన రాజారాం తమ గ్రామానికి ఏదో ఒకటి మంచి చేయాలని భావించాడు. ఈ క్రమంలోనే ఓ ఆలోచన తట్టింది. తన గ్రామానికి రోడ్డు మార్గం లేకపోవడంతో దానిని ఎలాగైనా నిర్మించాలని భావించాడు. ఆ రోడ్డు కోసం అధికారులు, నేతల చుట్టూ చాలా కాలంపాటు తిరిగారు. కానీ.. ఎవరూ ఆయన వినతిని పట్టించుకోలేదు. దీంతో ఆయనే గ్రామానికి రోడ్డు వేయడానికి నడుం బిగించారు.

అనుకోవడమే ఆలస్యం.. వెంటనే పనిలో దిగిపోయాడు. రేయింబవళ్లు రోడ్డు నిర్మాణం కోసం కష్టపడ్డాడు. అలా 57 ఏళ్లపాటు ఏడు కొండలను తవ్వి 40 కిలో మీటర్ల రోడ్డును నిర్మించారు. ఇందుకోసం తాను సంపాదించిన మొత్తాన్ని, రిటైర్మెంట్ సందర్భంగా వచ్చిన డబ్బును కూడా ఖర్చుపెట్టడం విశేషం. గతంలో సైకిల్ వెళ్లేందుకు కూడా మార్గంలేని గుండెగాన్ కు ఇప్పుడు పెద్దపెద్ద ట్రక్కులు కూడా వెళ్తున్నాయట. ఇదంతా రాజారాం బావ్ కర్ వల్లే జరిగిందని గ్రామస్థులు చెబుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajaram bavkar  dasarath majhi  mountain man  

Other Articles