Governor | Narasimhan | Eggs

Governor narasimhan fired on officials for eggs

Governor, Narasimhan, Eggs, Students, Mahabubnagar, Mahabubnagar Collector

Governor Narasimhan Fired on officials for eggs. The officials giving eggs to students only once in a week. Governor fire on this issue.

కోడి గుడ్డు కోసం గవర్నర్ ఫైర్

Posted: 08/24/2015 02:43 PM IST
Governor narasimhan fired on officials for eggs

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ చాలా సీరియస్ అయ్యారు. అసలు ఏం జరుగుతోంది...? మీరు ఏం చేస్తున్నారు..? దీని మీద వెంటనే నాకు రిపోర్ట్ ఇవ్వండి అంటూ అక్కడున్న అందిరి మీద గవర్నర్ గారుఅగ్గి మీద గుగ్గిలంలాగా ఫైరయ్యారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కిషన్ బాగ్ లో పర్యటించారు. అక్కడి పరిస్థితిని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, నీళ్లు, విద్య లాంటి వాటి విషయాల మీద గవర్నర్ నరసింహన్ అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులతో కలిసి గ్రామంలో పర్యటించి అక్కడ పలు విషయాల మీద అవగాహన కల్పించారు. అయితే ఈ కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడుతూ.. వారిచ్చిన సమాధానంతో గవర్నర్ ఒక్కసారిగా ఫైరయ్యారు. కలెక్టర్ మీద, అధికారుల మీద ఫైరయ్యారు. అసలు గవర్నర్ ఎందుకు అంతలా ఫైరయ్యారు....? కోడిగుడ్డు వ్యవహారం ఏంటో తెలుసుకోవాలి అంటే మొత్తం స్టోరీ చదవాల్సిందే.

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ మహబూబ్ నగర్ జిల్లా కిషన్ బాగ్ లో విద్యార్థులతో ముచ్చటించారు. అక్కడి విద్యార్థులను కొన్ని విషయాలను అడిగి తెలుసుకున్నారు. అయితే విద్యార్థులకు తిండి సరిగ్గా పెడుతున్నారా..? లేదా ఏమైనా లోపాలున్నాయా..? అంటూ గవర్నర్ ఆరా తీశారు. అయితే విద్యార్థులు తమకు వారానికి ఒక వారం గుడ్డు పెడుతున్నారు అని వెల్లడించారు. అదేంటి వారానికి రెండు రోజులు కదా గుడ్డు ఇవ్వాలి మరి ఒక రోజు మాత్రమే ఎందుకు ఇస్తున్నారు అని అక్కడి వారిని అడిగారు, అయితే ఒక్క ఈ పాఠశాలలోనే ఇలా ఉందా లేదా జిల్లా మొత్తం ఇలానే ఉందా..? అని అధికారులను అడిగారు. అయితే దీనిపై పూర్తి వివరాలు తనకు ఇవ్వాలని కలెక్టర్ ను గవర్నర్ ఆదేశించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Governor  Narasimhan  Eggs  Students  Mahabubnagar  Mahabubnagar Collector  

Other Articles