Islamic State's no. 2 leader killed in airstrike: US

Isis s no 2 fadhil ahmad al hayali killed in us airstrike

Islamic State, Fadhil Ahmad al-Hayali, US Airstrike, ISIS, Syria, Iraq, al hayali, number two, isisi no 2 leader dead, us, white house, air strike

Fadhil Ahmad al-Hayali was primary coordinator for moving large amounts of weapons, explosives, vehicles and people between Iraq and Syria

అమెరికా ద్రోణి దాడిలో ఐఎస్ఐఎస్ నెంబర్ టు ఫదిల్ అహ్మద్ అల్ హయాలి ధుర్మణం..

Posted: 08/22/2015 07:43 PM IST
Isis s no 2 fadhil ahmad al hayali killed in us airstrike

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో నెంబర్ టుగా ఇన్నాళ్లూ రాజ్యమేలిన ఫాదిల్ అహ్మద్ అల్ హయాలీ.. అలియాస్ హాజీ ముతాజ్ను అమెరికా వైమానిక దాడిలో హతమార్చింది. ఈనెల 18వ తేదీన అతడు ఇరాక్లోని మోసుల్ సమీపంలో ఓ వాహనంలో వెళ్తుండగా తమ వైమానిక దాడిలో అతడు మరణించాడని వైట్హౌస్ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇస్లామిక్ స్టేట్లో అల్ హయాలీ రెండో ముఖ్య నాయకుడు. ప్రధానంగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, వాహనాలను ఇరాక్ - సిరియా దేశాల మధ్య తరలించడంలో అతడు కీలకంగా వ్యవహరించేవాడు.

అమెరికా వైమానిక దాడిలో హాజీ ముతాజ్తో పాటు.. అబూ అబ్దుల్లా అనే మరో ఉగ్రవాది కూడా మరణించాడు. ఇస్లామిక్ స్టేట్ అగ్రనాయకుడు అబూబకర్ అల్ బాగ్దాదీకి అత్యంత సన్నిహితుడైన అల్ హయాలీ ప్రధానంగా ఇరాక్, సిరియా దేశాల్లో ఈ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలకు ఇన్ఛార్జిగా వ్యవహరించేవాడని అమెరికా ప్రతినిధి ప్రైస్ చెప్పారు. గతంలో అల్ కాయిదాలో కూడా అతడు పనిచేశాడన్నారు. 2014 జూన్ నెలలో మోసుల్ నగరాన్ని ఇస్లామిక్ స్టేట్ స్వాధీనం చేసుకోవడంలో కూడా ఇతడిదే కీలకపాత్ర.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : islamic state  al hayali  number two  isisi no 2 leader dead  us  white house  air strike  

Other Articles