telangana cm kcr make phone call to kusam rajamouli who is president of gangadevipalli village development committee

Telangana cm kcr phone call kusam rajamouli gangadevipalli village

cm kcr, kcr phone call rajamouli, director rajamouli news, kusam rajamouli, rajamouli updates, cm kcr news, cm kcr controversy, gramajyothi scheme

telangana cm kcr phone call kusam rajamouli gangadevipalli village : telangana cm kcr make phone call to kusam rajamouli who is president of gangadevipalli village development committee to talk about gramajyothi scheme.

రాజమౌళికి ఫోన్ చేసిన సీఎం కేసీఆర్..?

Posted: 08/19/2015 10:13 AM IST
Telangana cm kcr phone call kusam rajamouli gangadevipalli village

టైటిల్ చదవడానికి ఆశ్చర్యకరంగా వున్నా... జరిగింది మాత్రం నిజమే! సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో సీఎం కేసీఆర్ స్వయంగా రాజమౌళికి ఫోన్ చేశారు. ‘హలో రాజమౌళిగారూ.. నేనండి సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నా’ అని చెప్పగానే అటువైపు రాజమౌళి ఉబ్బితబ్బిబ్బయ్యారు. అయితే అవతల ఫోన్ లిఫ్ట్ చేసిన వ్యక్తి టాలీవుడ్ హిట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాదులెండి.. తన గ్రామాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టించిన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కూసం రాజమౌళి. ఈయన పేరు దర్శకధీరుడు పేరు ఒకటే కావడంతో ఈ న్యూస్ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవలే సీఎం కేసీఆర్ గంగదేవిపల్లిలో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసింది. అదే రోజు సాయంత్రం ఏడు గంటల సమయంలో కేసీఆర్ స్వయంగా రాజమౌళికి ఫోన్ చేశారు. ‘‘హలో రాజమౌళి గారు... నేను కేసీఆర్ ను మాట్లడుతున్నా. మీ గ్రామంలో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించి వచ్చాను కదా. దాని గురించి జనం ఏం అనుకుంటున్నారు? అంత సవ్యంగానే జరుగుతోందా..?’’ అని కేసీఆర్ ఆయనను అడిగారట. దీంతో స్వయంగా సీఎం తనకు ఫోన్ చేయడంతో రాజమౌళి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. తనకు నేరుగా ఫోన్ చేయడంతో ఆయన కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్పారు. గంగదేవిపల్లికి రావడం సంతోషాన్నిచ్చిందని, గ్రామాభివృద్ధికి ఏ సహకారం కావాలన్నా ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని రాజమౌళి పేర్కొన్నారు. ఇదీ.. అసలు కథ!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cm kcr  rajamouli  telangana politics  gramajyothi  

Other Articles