Police release footage of suspect in Bangkok bombing

Bangkok blasts suspect identified in cctv footage

Bangkok bomb, Erawan Shrine, suspected bomber, manhunt, bangkok, blasts, blast suspect, cctv footage,bombing, Thailand, Newsy, Bangkok,Bombs

Police released these pictures of a man filmed by security camereas. He is believed to be involved in the bombing at the Erawan Shrine.

బ్యాంకాక్ పేలుళ్లు అనుమానితుడి కోసం ముమ్మర గాలింపు

Posted: 08/18/2015 09:53 PM IST
Bangkok blasts suspect identified in cctv footage

థాయ్లాండ్ రాజధాని, ప్రముఖ పర్యాటక కేంద్రమైన బ్యాంకాక్ నగరంలో పేలుడు కేసు నిందితుడిని సీసీటీవీ ఫుటేజిలో గుర్తించారు. ఒక ఫొటోలో వెనక బ్యాగు తగిలించుకుని, మరో ఫొటోలో మాత్రం బ్యాగు లేకుండా వెళ్లిన ఓ యువకుడే ఈ పేలుళ్లకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని 'ద టెలిగ్రాఫ్' పత్రిక తెలిపింది. సోమవారం రాత్రి సంభవించిన పేలుడులో 20 మంది మరణించారని, 123 మంది గాయపడ్డారని తెలిపింది.

చైనా నుంచి వచ్చిన ఓ పర్యాటకుడు మొత్తం పేలుడు ఘటనను చిత్రీకరించారు. జుంటా వ్యతిరేక దళాలు ఈ దాడికి పాల్పడి ఉంటాయని అనుమానిస్తున్నారు. మొత్తం 20 మంది సోమవారం నాటి ఘటనలో మరణించగా.. వాళ్లలో ఐదుగురు థాయ్లాండ్ వాళ్లు, ఇద్దరు మలేసియన్లు, ఇద్దరు చైనీయులు, ఇద్దరు హాంకాంగ్ పౌరులు, ఒక సింగపూర్ వ్యక్తి మరణించారు. మరో మృతుడి జాతీయత ఏంటన్న విషయం తెలియలేదని అక్కడి అధికారులు తెలిపారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bangkok  blasts  blast suspect  cctv footage  

Other Articles