Jagan | Narayana | Narayana college

Ys jagan demand to resign narayana to his ministry

Jagan, Narayana, Narayana college, hostel, Suicide, Nagarjuna University, chandrababu naidu

YS Jagan demand to resign Narayana to his ministry. On suicide of two students in Narayana college, Jagan visited students.

ఆ కాలేజిని కాపాడేందుకు చంద్రబాబు ప్రయత్నం..!

Posted: 08/18/2015 01:20 PM IST
Ys jagan demand to resign narayana to his ministry

ఏపి సిఎం చంద్రబాబు నాయుడు మీద వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్ మండిపడ్డారు. కడప జిల్లాలో నారాయణ కాలేజిలో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థినుల కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. వైయస్ జగన్ ఇద్దరు విద్యార్థినుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జగన్ మోహన్ రెడ్డి ఏపి సిఎం చంద్రబాబు నాయుడు వైఖరి మీద మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు నారాయణ కాలేజి యాజమాన్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్పారని.. వెంటనే మంత్రి నారాయణ తన పదవికి రాజీనామా చేయాలని.. వెంటనే పోలీసులు మంత్రిని అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడుకు నారాయణ కాలేజీల్లో వాటా ఉందని అందుకే కనీసం మాట్లాడటానికి కూడా ముందుకు రావడం లేదని మండిపడ్డారు.

నారాయణ కాలేజీల్లో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. కానీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటి కాలేజీలో రిషితేశ్వరి అనే విద్యార్థిని ఆత్మహత్య మీద ఇంకా విచారణ కొనసాగుతూనే ఉందని.. వారి కుటుంబానికి ఎప్పుడు న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ఈ ఇద్దరు విద్యార్థులకు పోస్ట్ మార్టం కూడా పద్దతిగా జరగలేదని జగన్ మండిపడ్డారు. అభం శుభం తెలియని పిల్లల మీద లవ్ లెటర్ అంటూ కథలు అల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ విద్యార్థులకు రీపోస్ట్ మార్టం చెయ్యాలని జగన్ డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jagan  Narayana  Narayana college  hostel  Suicide  Nagarjuna University  

Other Articles