Modi | Hitler | UAE | Dubai

Modi excellent speech as hitler

Modi, Hitler, UAE, Dubai, Narendra Modi, NRIs

Modi excellent speech as Hitler.Modi gave excellent speech to mobilise Indian people to invest in India.

అప్పుడు హిట్లర్.. ఇప్పుడు మోదీ.. దిగ్రేట్

Posted: 08/18/2015 11:09 AM IST
Modi excellent speech as hitler

హిట్లర్ గురించి ప్రపంచానికి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ప్రపంచ మానవాళి చరిత్రలో హిట్లర్ రాసిన రక్త చరిత్ర గురించి అందరికి తెలుసు. ప్రపంచ చరిత్రను రక్తంతో నింపిన హిట్లర్ పేరు చెబితే చాలు ఇప్పటికే రాక్షసత్వానికి పరాకాష్టగా ఉంటుంది. అలాంటి హిట్లర్ లో ఉన్న కోణం నాయకత్వం. ఒక టీంలో ఉన్న పది మందిని లీడ్ చెయ్యాలంటేనే తల ప్రాణం తోకకు వస్తుంది.. సాలరీల కోసం పని చేస్తున్న వారిని హ్యాండిల్ చెయ్యాలంటేనే తలనొప్పి వస్తుంది. కానీ ఎంతో మంది తనను ఫాలోఅయ్యేటట్లు చేశారు. తాను అనుకున్న ఆశయం కోసం ఎంతో మందిని బలితీసుకోవడానికైనా, బలిచెయ్యడానికైనా లక్షల మంది సైన్యాన్ని సిద్దం చేశారు హిట్లర్. అందుకే హిట్లర్ గ్రేట్. నాయకత్వానికి రాక్షసరూపం ఇస్తే అది హిట్లర్ గా ఉంటుంది. గతంలో ఉన్న హిట్లర్ లక్షణాలే మోదీకి ఉన్నాయి.

నిన్న యుఎఇలో మోదీ ప్రభంజనం గురించి అక్కడి మీడియాతో పాటు, అంతర్జాతీయ మీడియా విరగబడి కథనాలు ప్రచురించింది. మోదీ ఎన్నికల సమయంలో ఎంత క్రేజ్ ఉందో ఇప్పుడు కూడా అంతే క్రేజ్ ఉంది అన్నంతలా జనం మోదీ ప్రసంగానికి క్యు కట్టారు. దుబాయ్ లోని క్రికెట్ స్టేడియంలో యాభై వేల మంది భారతసంతతి ప్రజలను ఉద్దేశించి మోదీ చేసిన ప్రసంగం ప్రపంచాన్ని ఆలోచనలో పడేసింది. అలాగే కొన్ని దేశాలకు ఆ ప్రసంగం వార్నింగ్ లా కూడా అనిపించింది. వేల సంఖ్యలో జనాలను, లక్షల సంఖ్యలో భారతీయులను మోదీ తన మాటలతో ప్రభావితం చేస్తున్నారు. భారత్ గురించి ఆలోచించండి అన్న మాట ఎన్నో భారతీయ గుండెలను మాతృ భూమి గురించి తట్టిలేపుతోంది. హిట్లర్ తన సైన్యాన్ని యుద్దానికి తన మాటల ప్రవాహంతో సిద్దం చేసినట్లే.. మోదీ కూడా తన మాటల తూటలతో భారతీయులను భారత్ అభివృద్దికి సిద్దం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Hitler  UAE  Dubai  Narendra Modi  NRIs  

Other Articles