Narayana College | Suicide | Manisha | Nandini

Two students suicide in narayana college at kadapa

Narayana College, Suicide, Manisha, Nandini, Rishiteshwari, Kadapa

Two students suicide in Narayana College at Kadapa. Nandini, Manisha studing Inter First year in Kadapa narayana college.

హాస్టల్ లో ఆత్మహత్య చేసుకున్నఅమ్మాయిలు

Posted: 08/18/2015 08:46 AM IST
Two students suicide in narayana college at kadapa

మొన్న రిషితేశ్వరీ.. నేడు నందిని, మనీషా.. ఇలా అర్ధాంతరంగా సరస్వతీ పుత్రులు ప్రాణాలు తీసుకుంటున్నారు. కడపలోని నారాయణ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యలు కలకలం రేపాయి. నారాయణ కాలేజీ హాస్టల్‌ గదిలో ఇద్దరు విద్యార్థినులు ఫ్యాన్‌లకు ఉరివేసుకున్నారు. వారి ఆత్మహత్యతో విద్యార్థి సంఘాలు కాలేజీపై దాడికి దిగాయి. ఆందోళన కారులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇటు తమ పిల్లల ఆత్మహత్యలపై మృతుల తల్లిదండ్రులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


సాయంత్రం తరగతులు ముగిసిన తర్వాత హాస్టల్ గదిలోకి వెళ్లిన విద్యార్థులు చున్నీలకు వెలాడుతున్న నందిని, మనీషా మృతదేహాలను చూసి షాక్‌ తిన్నారు. వెంటనే ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యానికి చెప్పారు. విషయం తెలిసిన విద్యార్థినుల తల్లిదండ్రులు, బంధువులు హాస్టల్‌కు చేరుకున్నారు. విగతజీవులుగా ఉన్న తమ బిడ్డలను చూసి బోరున విలపించారు. విద్యార్థుల ఆత్మహత్యలపై నందిని, మనీషా తల్లిదండ్రులు, బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. తమ పిల్లల ఆత్మహత్యలకు కళాశాల యాజమాన్యమే కారణమని ఆరోపించారు.

నందిని, మనీషా ఆత్మహత్యల పట్ల విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. సమాచారం తెలిసిన వెంటనే విద్యార్థి సంఘాల నేతలు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళన చేశారు. విద్యార్థి సంఘాల నేతలు, మృతుల బంధువులు కాలేజీపై దాడికి దిగారు. ఫర్నిచర్‌, అద్దాలు ధ్వంసం చేశారు. ఒక దశలో నారాయణ కాలేజ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నందిని, మనీషాల ఆత్మహత్యలు జరిగిన తీరును పరిశీలిస్తే వందలమంది విద్యార్థినులు ఉన్న హస్టల్‌లో ఆత్మహత్య చేసుకోవడం వీలు కాదన్నది కొందరి వాదన. విద్యార్థినుల సుసైడ్ నోట్‌ను కాలేజీ యాజమాన్యం మాయం చేశారన్నా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసు విచారణను జిల్లా ఎస్పీ నవీన్‌ గులాఠీ పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనలతో కాలేజీ విద్యార్థినులు భయంతో వణికిపోతున్నారు. విద్యార్థునుల సూసైడ్‌తో కాలేజీ ఆవరణ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narayana College  Suicide  Manisha  Nandini  Rishiteshwari  Kadapa  

Other Articles