hackers | indian hackers | pakistani websites

Indian hackers show the hacking power to pakisatni hackers

hackers, indian hackers, pakistani websites, hacked websites, hacked

Indian hackers show the hacking power to pakisatni hackers. A group of anonymous Indian hackers, called 'Hell Shield Hackers', claimed to have taken down around 100 Pakistani business websites as a "tribute to Indian jawans"

దెబ్బకు ఠా.. పాకిస్థాన్ ముఠా

Posted: 08/17/2015 04:24 PM IST
Indian hackers show the hacking power to pakisatni hackers

భారత్ పాక్ సరిహద్దుల్లో అలజడి. అదే సమయంలో పాకిస్థాన్ హ్యాకర్లు.. ఇండియన్ సైబర్ స్పేస్‌పైనా గురిపెట్టారు. భారత వెబ్ సైట్లను హ్యాక్ చేయడమే లక్ష్యంగా పని చేసే పాక్ టీములు.. దూకుడు పెంచాయి. మనవైపు నుంచి ఎథికల్ హ్యాకింగ్ తప్ప.. ఇతరుల వెబ్ సైట్లను డౌన్ చేసే వారు తక్కువే. కానీ సైబర్ వార్ ముదురుతుండడండో మనదగ్గరా బ్లాక్ హ్యాట్స్ రంగంలోకి దిగారు. భారత్ జోలికొస్తే ఖబడ్దార్ అంటూ పాకిస్థాన్‌కు హెచ్చరికలు పంపారు. పాకిస్థాన్ హ్యాకర్లు రెచ్చిపోయారు. రోజువారీ కంటే.. ఎక్కువగా భారత వెబ్‌సైట్లపై దాడికి దిగారు. కొన్నిటిని బ్లాక్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇది రాజస్థాన్ ఏసీబీ వెబ్‌సైట్.. లో కార్గిల్ యుద్ధంలో గెలిచింది మేమే అంటూ పాక్ హ్యాకర్లు ఘనంగా ప్రకటించుకున్నారు. భారత్‌కు వ్యతిరేకంగా వెకిలి కార్టూన్లు, కామెంట్లు పెట్టారు. పాకిస్థాన్ ఆగడాలను చూస్తూ ఊరుకోని భారత హ్యాకర్లు పాకిస్థాన్‌కు చిన్న ఝలక్ ఇచ్చారు. ఏకంగా 100 కీలకమైన పాకిస్థాన్ బిజినెస్ వెబ్ సైట్లను పంద్రాగస్టు రోజున డౌన్ చేశారు. భారత జవాన్ల త్యాగాలను పాక్ వెబ్‌సైట్లలో పోస్ట్ చేశారు. అమర జవాన్లకు అంకితమంటూ రాసుకొచ్చారు. పాకిస్థాన్ వెబ్ సైట్లను డౌన్ చేసింది. అంతేనా.. వారి వెబ్‌సైట్లలో ఘాటు సందేశాలనూ ఉంచారు.

"మమ్మల్ని అనవసరంగా నిద్ర లేపారు. భారత వెబ్ సైట్లపై అకారణంగా దాడి చేస్తే చూస్తూ ఊరుకోం. మీరు ఎటాక్ చేస్తే, మేం ప్రతిదాడి చేస్తాం. సైబర్ స్పేస్ శాంతియుతంగా ఉండాలి. కానీ దాన్ని మీరు (పాక్) ఉల్లంఘిస్తున్నారు. ఇప్పుడు మేము చేసి చూపింది తక్కువే. మేం కన్నెర్ర చేస్తే అసలు సీన్ వేరుగా ఉంటుంది." ఇండియాలో అతిపెద్ద బ్లాక్ హ్యాట్ టీమ్ హెల్ షీల్డ్ హ్యాకర్స్ అంటున్నారు. ఈ సంస్థతో దాదాపు వెయ్యిమంది వరకు ఔత్సాహికులు రిజిస్టర్ చేసుకున్నారట. హ్యాకింగ్ పరిభాషలో బ్లాక్ హ్యాట్ అంటే వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయడం. వైట్ హ్యాట్ అంటే ఎథికల్ హ్యాకింగ్. వెబ్‌సైట్‌ను డౌన్ చేయడాన్ని డీఫేసింగ్ అంటారు. నిజానికి భారత్‌లో ఎథికల్ హ్యాకింగ్ తప్ప బ్లాక్ హ్యాట్ లేదు. అలాంటి వాటిని భారత్ ఎప్పుడూ ప్రోత్సహించలేదు. కానీ.. సైబర్ స్పేస్‌లో పెరిగిన పాకిస్థాన్ ఆగడాలు, మన వెబ్‌సైట్లు డౌన్ అవడం చూడలేని కొందరు.. పాకిస్థాన్‌కు పట్టపగలే చుక్కలు చూపించారు. పాక్‌కు చెందిన వంద వెబ్‌సైట్లను హ్యాక్ చేయడం కేవలం శాంపుల్ మాత్రమే అని.. తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెల్ షీల్డ్ హ్యాకర్స్ పాకిస్థాన్‌ను గట్టిగానే హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hackers  indian hackers  pakistani websites  hacked websites  hacked  

Other Articles