Centre will Wait Till Final Verdict on HC Bifurcation, Says Law Minister

Centre writes to ap on separate hc

Andhra Pradesh, Law College, special high court, union minister, sadananda gowda, special status, Union Government, separate High Court, AP government opinion, functional High Court, infrastructure

The Union Government has written to Andhra Pradesh on the issue of separate High Court. The letter sought government opinion on infrastructure necessary for a functional High Court, Union Minister for Law and Justice D. V. Sadananda Gowda said.

అక్కడ నిర్ణయం వెలువడిన తరువాతే.. ఏమైనా.. అంతవరకు..

Posted: 08/17/2015 11:00 AM IST
Centre writes to ap on separate hc

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రత్యక హైకోర్టు ఏర్పాటు అంశాన్ని కేంద్రం కీలకాంశంగా పరిగణిస్తోందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ పేర్కొన్నారు. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ఉమ్మడి హైకోర్టులో పెండింగ్‌లో ఉందని, కోర్టు తీర్పు వచ్చే వరకు ఏమీ చేయలేనన్నారు. అయితే కోర్టుకు స్థలం, వసతులు, నిధులు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాక ఏపీకి కొత్త హైకోర్టు ఏర్పాటుకు ఆ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించాల్సి ఉంటుందన్నారు.

భూమి, ఇతర సదుపాయాలు కల్పించే బాధ్యత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని హైకోర్టు తీర్పునిచ్చిందని గుర్తుచేశారు. ఈ అంశంపై చర్యలకు గతంలో ఏపీ సీఎం చంద్రబాబు, గవర్నర్‌ నరసింహన్ కు లేఖ రాసినట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు ఏపీ సీఎం నుంచి సమాధానం రాలేదన్నారు. ప్రస్తుత హైకోర్టు తెలంగాణకే చెందుతుందని, కొత్త హైకోర్టును ఏపీ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని విభజన చట్టంలో ఉందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హైకోర్టు విషయంలో తన చేతులు కట్టేసి ఉన్నాయన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రశ్నించగా.. కేంద్రం కట్టుబడి ఉందన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : special high court  union minister  sadananda gowda  special status  

Other Articles