Telangana | Chief Minister | Unfurls | National Flag | KCR | Golconda fort

Telangana chief minister unfurls national flag at golconda fort

Telangana,Telangana Chief Minister,K Chandrashekar rao, KCR, Golconda fort, Independence Day,Telangana Independence Day Celebrations, CM KCR , flag hoisting , Golconda fort , hyderabad , India , independence day , 69th independence day , independence day celebrations , red fort , cm kcr speech , jaihind

Telangana Chief Minister K Chandrashekar rao unfurled the national flag at Golconda fort in Hyderabad today to mark India's 69th Independence Day.

సర్వతోముఖాభివృద్ధి దిశగా తెలంగాణ: కేసీఆర్

Posted: 08/15/2015 11:41 AM IST
Telangana chief minister unfurls national flag at golconda fort

ప్రజలముందుకు త్వరలో బృహత్‌ నీటిపారుదల పథకాన్ని తీసుకురానున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. 69వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కండలో కేసీఆర్‌ జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కోతలు లేని విద్యుత్‌ సరఫరా చేస్తున్నామన్నారు. మార్చి నాటికి రైతులకు 9 గంటల విద్యుత్‌ అందజేస్తామని స్పష్టం చేశారు. మిషన్‌ కాకతీయ పథకాన్ని రైతులు ఉపయోగించుకోవాలని సీఎం సూచించారు. ఏటా 9వేల చెరువులకు మరమ్మతులు చేస్తున్నామని వివరించారు.

పరిశ్రమల ఏర్పాటుకు లక్షా50వేల ఎకరాల భూమిని పరిశ్రమలశాఖకు కేటాయించామన్నారు. తెలంగాణలో ఇటీవల జరిగిన గోదావరి మహాపుష్కరాలకు ఘనంగా నిర్వహించామని కేసీఆర్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌ తాగునీటి సమస్య పరిష్కారం కోసం 30 టీఎంసీల రెండు రిజర్వాయర్లను నిర్మిస్తామని కేసీఆర్‌ వెల్లడించారు. గ్రామలను అభివృద్ధి చేసేందుకే గ్రామజ్యోతి పథకాన్ని ప్రవేశపెట్టామని వివరించారు. వచ్చే ఏడాది రానున్న కృష్ణా పుష్కరాలకు ప్రభుత్వం సన్నద్ధమవుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు.
 
సంక్షేమ రంగంలో తెలంగాణ మొదటి స్తానంలో ఉందని ఉద్ఘాటించారు. నీటిపారుదల, విద్యుత్‌, వ్యవసాయరంగం, సంక్షేమ రంగాల్లో సత్ఫలితాలు సాధించామని తెలిపారు. సంక్షేమా రంగానికి బడ్జెట్‌లో రూ.28 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. రుణమాఫీ కింద రైతులకు 2 విడతల్లో రూ.8,500 కోట్లు చెల్లించామన్నారు. అలాగే ధరల స్థిరీకరణకు రూ.400 కోట్లు కేటాయించినట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : K Chandrashekar rao  KCR  Independence Day  Telangana  

Other Articles