After Public Outrage, Delhi Police Backs Off Army Veterans' Protest

Pressure mounts on govt over one rank one pension

Pressure mounts on govt. over One Rank One Pension, After Public Outrage, Delhi Police Backs Off Army Veterans' Protest, OROP,One Rank One Pension,Jantar Mantar,OROP Protests,OROP Protest,Independence Day,Independence Day security, Breaking news, general, politics, sport, entertainment, lifestyle, weird, world, india news, entertainment news

Pictures of Army veterans being pushed around in Delhi drew immediate public uproar, forcing the city's police to back off protests that it tried to truncate at Jantar Mantar, the capital's designated spot for public protests.

ఒకే ర్యాంక్‌ ఒకే పెన్షన్‌ కోసం మాజీసైనికుల ఆందోళన

Posted: 08/14/2015 02:12 PM IST
Pressure mounts on govt over one rank one pension

అధికారంలోకి రాగానే ఆర్మీ రిటైర్టు ఉద్యోగులందరకీ ఒకే ర్యాంక్‌, ఒకే పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తామని సార్వత్రిక ఎన్నికలలో బీజేపి ఇచ్చిన హానీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ ఆర్మీ ఉద్యోగులు తలపెట్టిన ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. ఒకే ర్యాంక్‌, ఒకే పెన్షన్‌ విధానాన్ని అమలు కోరుతూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద మాజీ సైనికులు శుక్రవారం ఆందోళనకు దిగారు. తమకు హామి ఇచ్చిన ప్రభుత్వం.. ఆ విషయాన్ని మర్చిపోయిందని వారు ఆరోపించారు. కొత్త ప్రభుత్వం గద్దెనెక్కి 16 మాసాలు కావస్తున్నా ఇంకా తమ డిమాండ్ అపరిష్కృతంగానే వుందని నినదించారు. తక్షణం ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తమకిచ్చిన ఎన్నికల హామీని నెరవేర్చాలని విన్నవించారు.

అలా వారి ఆందోళన ప్రారంభం కాగానే హుటాహుటిన అక్కడకు చేరుకున్న ఢిల్లీ పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. మాజీ సైనికులను తరిమికొట్టారు. వారు ఏర్పాటు చేసుకున్న టెంట్లను బలవంతంగా తొలగించారు. స్వాతంత్య్రదిన వేడుకలకు భద్రతా చర్యల్లో భాగంగానే తాము జంతర్‌మంతర్‌ను ఖాళీ చేయించాల్సి వచ్చిందని పోలీసులు అంటున్నారు. అయితే ఒకే ర్యాంక్‌ ఒకే పెన్షన్‌ అమలుపై ప్రధాని మోదీ స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తాము ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లబోమని మాజీ సైనికులు తేల్చి చెప్పారు. మోడీ సర్కారుకు వ్యతిరేకంగా, పోలీసులకు వ్యతిరేకంగా మాజీలు బ్లాక్ ఇండిపెండెన్స్ డే అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ స్వల్ప ఉద్రిక్తత కూడా చోటుచేసుకుంది. దీంతో పోలీసులు వారి దీక్షస్థలి వద్ద భారీగా మోహరించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : OROP  one rank one pension  Independence day  Delhi Police  PM Modi  

Other Articles