Revanth Reddy Controversial Comments CM KCR | Cash For Vote Case | Raja Sadaram

Revanth reddy controversial comments cm kcr cash for vote case

revanth reddy, cm kcr, cash for vote, note for vote, hyderabad acb court, kcr controversy, raja sadaram, kodangal, tdp party, trs party

Revanth Reddy Controversial Comments CM KCR Cash For Vote Case : TDP MLA Revanth Reddy Makes Controversial Comments On Cm Kcr Near ACB Court.

‘కేసీఆర్ ని వదిలేది లేదు’

Posted: 08/14/2015 12:59 PM IST
Revanth reddy controversial comments cm kcr cash for vote case

‘ఓటుకు నోటు’ కేసులో ప్రధాన నిందితుడైన టీ-టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసు విచారణ నిమిత్తం హైదరాబాదులోని హైదరాబాదులోని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారంపై, కేసీఆర్ పై ఘాటుగా స్పందించారు. ‘ఉన్న పార్టీని వీడిది లేదు. కేసీఆర్ ను వదిలేది లేదు’ అని ఆయన ప్రకటించారు. కేసుకు సంబంధించి కేసీఆర్ సర్కారుతో పోరు సాగిస్తానని రేవంత్ పునరుద్ఘాటించారు.

‘ఓటుకు నోటు’ కేసుకు సంబంధించి చార్జీషీటు దాఖలు చేస్తే.. ప్రభుత్వ కుట్రలు ఒక్కొక్కటిగా బహిర్గతం అవుతాయని రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్ సర్కారుపై ఘాటు విమర్శలు చేస్తూనే.. అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాంపై విరుచుకుపడ్డారు. పదీవీ విరమణ పొందిన రాజా సదారాంను మళ్లీ ఆ పదవిలో పొడిగించాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. రాజా సదారాం టీఆర్ఎస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాజా సదారాంపై కోర్టులో పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకముందని ప్రకటించిన ఆయన, ప్రభుత్వ కుట్రలపై పోరులో మాత్రం వెనుకంజ వేసేది లేదని తేల్చిచెప్పారు. అయితే.. కేసు కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో కేసుపై మీడియా సంధించిన మరిన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం దాటవేశారు.

తాను పార్టీని వీడేది లేదని పేర్కొన్న రేవంత్.. మరో 25 ఏళ్లపాటు కొడంగల్ లో తనకు అపజయమే లేదన్నారు. కొడంగల్ ప్రజలకు తనపై పూర్తి విశ్వాసముందని, వారంతా తన వెంటే ఉన్నారని పేర్కొన్నారు. ఇకపై అక్కడి నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : revanth reddy  cm kcr  note for vote  

Other Articles