Another Diary Found In Rishiteshwari Suicide Case | Guntur Nagarjuna University | Ragging

Another diary found in rishiteshwari suicide case guntur nagarjuna university

Rishiteshwari case, Rishiteshwari suicide, Rishiteshwari diary, nagarjuna university, ragging case, police investigation, Rishiteshwari photos, Rishiteshwari controversy,

Another Diary Found In Rishiteshwari Suicide Case Guntur Nagarjuna University : In Rishiteshwari Suicide Case The Another Diary Found In Which She Wrote Senior Students Name Who Tortured Her.

రిషితేశ్వరి కేసులో బయటపడ్డ మరో ‘డైరీ’

Posted: 08/14/2015 09:10 AM IST
Another diary found in rishiteshwari suicide case guntur nagarjuna university

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన రిషితేశ్వరి కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆత్మహత్యకు ముందు ఆమె రాసుకున్న మరో డైరీ బయటపడింది. వరంగల్‌లోని తమ ఇంట్లో రెండో డైరీని గుర్తించిన రిషితేశ్వరి తల్లిదండ్రులు మురళీకృష్ణ, దుర్గాబాయి... దానిని గుంటూరులోని పోలీసు ఉన్నతాధికారులకు అందజేశారు. ఈ రెండో డైరీలో 13 పేజీల్లో రిషితేశ్వరి తాను యూనివర్సిటీలో చేరినప్పటి నుంచి పడిన నరకయాతన గురించి, తనను సీనియర్లు వేధించిన తీరును, తాను అనుభవించిన ఆవేదనను ఎంతో బాధగా రాసుకుంది. ఇప్పటికే రాషితేశ్వరి రాసిన ఒక డైరీ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దాని ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన రెండో డైరీతో ఈ కేసు మలుపు తిరిగింది. ఈ కేసులో సీనియర్ విద్యార్థులైన హనీషా, జయచరణ్, శ్రీనివాస్‌ అరెస్టయిన విషయం విదితమే!

నిజానికి రిషితేశ్వరి రాసుకున్న మొదటి డైరీలో తనను వేధింపులకు గురిచేసిన సీనియర్ల పేరు రాసినప్పటికీ అవి కొట్టివేసి ఉన్నాయి. దాంతో అవి తమ పేర్లు కాదని రిమాండ్‌లో ఉన్న సీనియర్ విద్యార్థులు బుకాయిస్తున్నారు. కానీ.. తాజాగా బయటపడ్డ రెండో డైరీలో మాత్రం వారి ముగ్గురి పేర్లను రిషితేశ్వరి స్పష్టంగా రాసుకుంది. శ్రీనివాస్, జయచరణ్‌లు తమను ప్రేమించాలంటూ తనను తీవ్ర వేధింపులకు గురిచేసేవారని, పలుమార్లు అసభ్యంగా కూడా ప్రవర్తించారని ఆమె ఈ రెండో డైరీలో పేర్కొంది. అయితే.. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే బాధపడతారనే ఉద్దేశంతో తాను చెప్పలేకపోయినట్లు రాసుకుంది. ఇక వారిద్దరితోపాటు హనీషా సీనియర్లతో ప్రేమ వ్యవహారం కొనసాగించాలంటూ తనపై పదేపదే ఒత్తిడి తీసుకొచ్చిందని తెలిపింది. అలా చేయడానికి ఒప్పుకోక పోవడంతో తాను సోదరుడిగా భావించే జితేంద్రతో తనకు అక్రమ సంబంధం వున్నట్లుగా వారు ముగ్గురు ప్రచారం చేశారని, తనని అడుగడుగునా వేధించారని డైరీలో రాసింది.

ఈ రెండో డైరీలో మరో కీలక విషయాన్ని రిషితేశ్వరి రాసుకుంది. ఆ ముగ్గురు విద్యార్థులు తనను తరుచూ వేధించడమే కాకుండా మరో ఇద్దరు విద్యార్థులు అభిషేక్, ఆదిత్య కూడా తమను ప్రేమించమంటూ ప్రతిపాదించారని ఆమె పేర్కొంది. వారిద్దరు తనను అలా అడగడంపై తాను షాక్‌కు గురయ్యానని.. దాంతో ఎవరిని నమ్మాలో, ఎవరితో స్నేహంగా ఉండాలో తెలియని అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయానని వెల్లడించింది. సీనియర్ల వేధింపులతో తాను సగం చచ్చిపోయినట్లు అనిపించిందని ఆమె ఆవేదనను కళ్లకు కట్టినట్లు రాసుకుంది. ఈ విధంగా తాను రాసుకున్న రిషితేశ్వరి డైరీని అందుకున్న పోలీసులు.. అందులో వున్న చేతిరాత రిషితేశ్వరిదా? కాదా? అనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు గుంటూరు పోలీసులు దాన్ని హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపినట్లు సమాచారం. అలాగే.. ఈ డైరీలోని మరికొన్ని విషయాలు ఇంకా బయటపడాల్సి ఉంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rishiteshwari case  nagarjuna university  ragging  

Other Articles