Extortionist attacks shopkeeper with sword, four held

On cctv mumbai shopkeeper attacked with sword customer saved him

Mumbai Shopkeeper Attacked With Sword, Shopkeeper attacked with sword, Extortion, Extortionist, Mumbai, Chembur, rowdyism, Extortionist attacks shopkeeper with sword, Extortionist, cctv footage, mumbai shopkeeper, attack, sword, customer, life

When he was attacked with a sword, security cameras within his shop captured the assailants and the heroic customer who sprang to the rescue of Rajnish Singh Thakur in Mumbai.

ITEMVIDEOS: ముంబాయిలో రౌడీరాజ్యం.. కస్లమర్ సాహసం ఆ ప్రాణాన్ని నిలిపింది..

Posted: 08/13/2015 10:04 PM IST
On cctv mumbai shopkeeper attacked with sword customer saved him

దేశ ఆర్ధిక రాజధాని ముంబయి నగర వీధుల్లో రౌడీయిజం దౌర్జనకాంఢను అడ్డూఅదుపు లేకుండా కోనసాగిస్తుంది. అటు ప్రభుత్వాలు మారినా.. ఇటు పోలీసు అధికారులు హెచ్చరించినా అవి తమకు షరా మామూలే అన్నట్లుగా రౌడీలు ప్రేటేగిపోతున్నారు. పోస్టర్లను వేసి మరీ డబ్బును అక్రమంగా వసూళ్లు  చేస్తున్నారంటే అసలు ముంబాయిలో శాంతిభద్రతల ఊసే ప్రశ్నార్థకంగా మారిందన్న విమర్శలు వినబడుతున్నాయి. ఇందుకు తాజా ఘటనే ఉదాహరణ. రౌడీల అగడాల నుంచి ఓ వినియోగదారుడు తన సాహసంతో నిండు  ప్రాణాన్ని కాపాడగలిగాడు. వికలాంగుడైన రజ్నీష్ సింగ్ ఠాకూర్ అనే ఓ మొబైల్ షాప్ యజమానిపై ఓ వ్యక్తి తల్వార్తో దాడి చేశాడు.



అదే సమయంలో షాపులో ఫోన్ కొనేందుకు వచ్చిన ఒక వినియోగదారుడు ఎంతో ధైర్యం చేసి ఆ వ్యక్తిని అడ్డుకున్నాడు. అంతేకాదు తన చేతుల్లో బంధించి పక్కన ఉన్న వ్యక్తులకు అప్పజెప్పాడు. అప్పటికే హత్య చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తి రెండుసార్లు కత్తితో దాడి చేయడంతో చేతికి, మెడకు గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ఈ దృశ్యం అంతా కూడా ఆ షాపులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ ఘటన వెనుక మొత్తం ఆరుగురు వ్యక్తుల హస్తం ఉందని పోలీసులు తేల్చారు. ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసి మరో ఇద్దరి కోసం గాలింపులు ప్రారంభించారు.

వివరాల్లోకి వెళ్తే.. ఈ మధ్య రౌడీయిజం చేస్తూ కొందరు వ్యక్తులు రోజుకు వెయ్యి రూపాయలు తమకు చెల్లించాలని బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని, అలాంటి వాటిని ప్రోత్సహించకుండా ఉండాలని, ఎవరైనా మాముళ్లు ఇస్తే వారి షాపులు తగులబెడతామని కూడా ఆ పోస్టర్లో హెచ్చరించారు. దీంతోపాటు ఎవరైనా వసూళ్లకు పాల్పడేవారు వస్తే తనకుగానీ, తన సోదరుడికిగానీ ఫోన్ చేయవచ్చని కూడా అందులో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే వసూళ్లకు పాల్పడేవారు మొత్తం ఆరుగురు కలిసి రజ్నీష్ సింగ్ అనే వ్యక్తిని హత్య చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. మొత్తం ఆరుగురిలో ఐదుగురు కారులో కూర్చోగా ఒకరు మాత్రం కత్తితో వచ్చి సింగ్ పై దాడి చేయగా ఓ వినియోగదారుడు ధైర్యంగా అడ్డుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తికి సింగ్ కృతజ్ఞతలు తెలిపాడు. ఆ కస్టమర్ లేకుంటే తన సోదరుడు చనిపోయేవాడని సింగ్ సోదరుడు తెలిపాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cctv footage  mumbai shopkeeper  attack  sword  customer  life  

Other Articles