నీరే ప్రాణ కోటికి ప్రాణాధారం.. ప్రతి చుక్కను ఒడిసిపడదాం ఇలా ప్రభుత్వం నీటి ప్రాధాన్యత మీద ఎంతో ప్రచారం చేస్తోంది. ఎండాకాలంలో అయితే నీటికి ఎన్ని కష్టాలు పడతామో అందరికి తెలుసు. ప్రతి రోజు నీటికి కటకట అనే వార్తలు చూసీ చూసీ.. ఆ పరిస్థితిని మనం అనుభవించి అలవాటైంది. అయితే ప్రతి చుక్కను ఒడిసిపట్టడంలో మనం విఫలమవుతూనే ఉన్నాం. అయితే కాలిఫోర్సియాలో మాత్రం దీనికి విరుగుడు సృష్టించారు. అది కూడా మామూలుగా కాదు ప్రపంచం మొత్తం అవాక్కయ్యేలా కొత్త ఐడియాతో ప్రతి నీటిచుక్కను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. నీళ్లను వృధా చెయ్యకండి బాబూ అంటూ ఓ వైపు ప్రచారం చేస్తూనే మరోవైపు ఉన్న నీటిని ఎలా కాపాడుకోవాలొ కాలిఫోర్నియా రాష్ట్రం ప్రపంచానికి చూపించింది.
అమెరికాలోని కాలిఫోర్నియాలో తీవ్ర కరువు ఏర్పడింది. నీటి కోసం అక్కడి జనాలు అల్లాడిపోతున్నారు. నీళ్లుంటే అక్కడ పండగ అన్నంతలా తయారూంది పరిస్థితి. ఎండల తీవ్రత అంతకంతకు పెరుగుతుండటంతో జల వనరులు ఎండిపోతున్నాయి. అసలే కరువుచ ఉన్న నీళ్లు కూడా ఎగిరిపోతే ఇక ప్రజలకు చుక్కలే కనిపిస్తాయి. అప్పుడే అక్కడి వారికి ఓ చక్కటి ఆలోచన వచ్చింది. ఎలాగైనా సరే నీళ్లు ఎండ వేడిమికి ఎగిరిపోకుండా అడ్డుకోవాలని ప్లాన్ వేశారు. అందులో భాగంగా 75 ఎకరాల్లో విస్తరించివున్న లాస్ ఏంజెలిస్ మంచినీటి రిజర్వాయర్లో తీవ్రమైన ఎండల కారణంగా నీరు ఆవిరైపోకుండా ఉండేందుకు ప్లాస్టిక్ బాల్స్‌ను వాటిల్లోకి వదిలారు. పెద్ద పరిమాణంలోని ఆపిల్ అంతా ఉండే ప్లాస్టిక్ బాల్స్‌ను దాదాపు పదికోట్లు వదిలినట్లు లాస్ ఏంజెలిస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ వాటర్ అండ్ పవర్ అధికారులు తెలిపారు.
ఎండకు నీరు ఆవిరికాకుండా ఉండడంతోపాటు రసాయనిక చర్యలవల్ల నీరు కలుషితం కాకుండా ఉంటుందని, నల్ల రంగు బాల్స్‌ను వాడడంవల్ల సూర్యుడి అల్ట్రా వాయిలెట్ కిరణాలు కూడా నీటిపై ప్రభావం చూపవని అధికారులు వివరించారు. అంతేకాకుండా పక్షులు, ఇతర జంతువులు కూడా రిజర్వాయర్‌లోకి ప్రవేశించకుండా ఈ ప్లాస్టిక్ బాల్స్ అడ్డుకుంటాయని వారు చెప్పారు. తాము తీసుకున్న ఈ చర్య వల్ల ఏడాదికి 30 కోట్ల గ్యాలన్ల నీటిని పరిరక్షించుకోవచ్చని, ఈ నీటితో 8100 మంది ప్రజలకు ఏడాదిపాటు మంచినీటిని సరఫరా చేయొచ్చని వివరించారు. పైగా ఈ తరహా విధానం ద్వారా తమకు ఏడాదికి రూ.2,500 కోట్లు కలిసొస్తాయని చెబుతున్నారు. కానీ, పర్యావరణ సమతౌల్యం మాత్రం వారు విస్మరిస్తున్నారు. పశు పక్షాదుల దాహార్తిని తీర్చే తరుణోపాయం గురించి కూడా ఆలోచించడం లేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more