Rahul Gandhi | Sonia gandhi | Sushmaswaraj

Sushma launches scathing attack on sonia and rahul

Rahul Gandhi, Sonia gandhi, Sushmaswaraj, Parliament, Lalith Modi, Sushma in Parliament

The campaign for the ouster of External Affairs Minister Sushma Swaraj was on Wednesday met with a strong counter-offensive when she launched a no-holds-barred attack on Congress, accusing it of having taken money to help alleged Bofors middleman Ottavio Quattrocchi and then Union Carbide chairman Warren Anderson flee India even as the government rejected the demand for her resignation.

కక్కుర్తి కాంగ్రెస్ గురించి దేశం మొత్తం తెలుసు

Posted: 08/13/2015 10:25 AM IST
Sushma launches scathing attack on sonia and rahul

లలిత్ మోదీ వ్యవహారంతో పార్లమెంట్ ఉభయ సభల్లో మాటల తూటాలు పేలాయి. మీరెంతా అంటే మీరెంతా అని అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు వాదోపవాదాలు సాగాయి. లలిత్ మోదీ వ్యవహారంలో కేంద్ర విధేశీ వ్యవహారాల మంత్రి సుష్మస్వరాజ్ మీద మాటల దాడికి దిగారు ప్రతిపక్ష నాయకులు. అయితే కాంగ్రెస్ నాయకులు పదే పదే సుష్మా స్వరాజ్ ను టార్గెట్ గా చెయ్యడంతో సుష్మా వారికి కౌంటర్ ఎటాక్ చేశారు. గతంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ నిర్వాకాలను బిజెపి మంత్రి ఎండగట్టారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మీద పంచులు వేశారు. ఈ సారి వేసవి సెలవుల్లో రాహుల్ తన తల్లి సోనియా గురించి, గతంలో చేసిన స్కాంల గురించి ప్రశ్నించారు.

సుష్మాస్వరాజ్ మాటల తూటల వర్షం గురించి అందరికి తెలుసు. పార్లమెంటేరియన్ గా ఎన్నో సార్లు తన సేవలను అందించిన సుఫ్మా స్వరాజ్ కు ప్రతిపక్షాలు కోపం తెప్పించాయి. తన మీద వచ్చిన ప్రతి ఆరోపణ మీద తాను వివరణ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నానని.. ప్రతిపక్షాలు చర్చకు ముందుకు రావాలని.. ఆందోళనలు విరమించాలని చేతులెత్తికోరారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఆమె మాటలు చెవిన పెట్టలేదు. సుష్మ స్వరాజ్ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ నాయకుల చేష్టలతో తీవ్ర కోపానికి గురైన సుష్మా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మీద అంతెత్తుకు లేచారు.

ఈ సారి సెలవురోజుల్లో ఏకాంతంలో కూర్చొని కాంగ్రెస్ పార్టీ చరిత్రను, కుటుంబ చరిత్రను చదువుకోమని కేంద్ర మంత్రి సుష్మస్వరాజ్ రాహుల్‌కు సలహా ఇచ్చారు. బోఫోర్స్ కుంభకోణంలో ఖత్రోచీని, భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో వారెన్ ఆండర్సన్‌ను ఎందుకు వదిలిపెట్టారో మీ అమ్మ సోనియాను అడుగు తెలుస్తుందంటూ రాహుల్‌కు చురకలంటించారు. తానెప్పుడూ రహస్యంగా పనులు చేయలేదని, ఆ సంస్కృతి ఆది నుంచీ కాంగ్రెస్‌దేనని సుష్మ విరుచుకుపడ్డారు. నాడు ఖత్రోచి తప్పించుకుని పారిపోవడానికి సహకరించింది రాహుల్ తండ్రి రాజీవేనన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  Sonia gandhi  Sushmaswaraj  Parliament  Lalith Modi  Sushma in Parliament  

Other Articles