Police selections | AP | DGP Ramudu

No need to run five kilometers in the recruitment of police

Police, Police selections, AP, DGP Ramudu, AP Govt, Recruitmement of police, Police recruitment

no need to run five kilometers in the recruitment of police. Ap DGP Ramudu sent some reforms in the Recruitment process of police.

పోలీస్ కావాలంటే 5 కిలో మీటర్లు పరుగెత్తక్కర్లేదు..!

Posted: 08/12/2015 10:56 AM IST
No need to run five kilometers in the recruitment of police

పోలీస్ కావాలంటే ఐదు కిలోమీటర్ల రన్నింగ్ లో పాల్గొనాల్సిందే. అందులో భాగంగా అభ్యర్థులు ప్రాణాలకు తెగించి పరుగెత్తడం... అందులో కొంత మంది పరుగెత్తలేక చనిపోవడం జరిగాయి. అయితే పోలీస్ రిక్రూమెంట్ లో రన్నింగ్ ను తొలగించాలని.. ఒకవేళ పెట్టాల్సి వస్తే కేవలం ఒక మైలు అంటే 1.6 కిలోమీటర్లు మాత్రమే రన్నింగ్ పెట్టాలనే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. గతంలో .జరిగిన ఘటనల ఆధారంగా పోలీస్ రిక్రూమెంట్ లో మార్పులకు పోలీస్ శాఖ కసరత్తులు చేస్తోంది. గతంలోనే దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన డిజిపి జేవీ రాముడు దీని మీద స్పీడ్ పెంచారు. ఒకవేళ పోలీస్ శా ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే పోలీస్ జాబ్ మీద ఆశలు పెట్టుకున్న వారికి ఊరట, కాస్త వెసలు బాటు లభిస్తుంది.


పోలీసు ఎంపిక ప్రక్రియలో సమూల మార్పులు రానున్నాయి. స్క్రీనింగ్ టెస్ట్‌గా ఉన్న 5 కిలోమీటర్ల పరుగును తొలగిం చాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీని స్థానంలో ఒక మైలు(1.6 కి.మీ.) పరుగును చేర్చనున్నారు. డీజీపీ జేవీ రాముడు  ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఎంపిక ప్రక్రియలో మార్పుచేర్పులను ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని నిర్ణయించారు. పోలీసు ఎంపిక రాత పరీక్ష లోనూ మార్పులు చేయనున్నారు.ప్రిలిమ్స్, మెయిన్స్ నిర్వహించాలని యోచిస్తున్నారు. ప్రభుత్వ ఆమోదం లభిస్తే ఇకపై జరిగే అన్ని రిక్రూట్‌మెంట్లలో ఇదే విధానాన్ని అమలు చేస్తారు. ఆబ్జెక్టివ్ తరహాలో ఉండే ప్రిలిమ్స్‌ను స్క్రీనింగ్ పరీక్షగా నిర్వహించి, తర్వాత దేశదారుఢ్య పరీక్షలతోపాటు ఈవెంట్స్ నిర్వహించాలని భావిస్తున్నారు. వీటిలో అర్హత సాధించినవారికి మెయిన్స్ పరీక్ష ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Police  Police selections  AP  DGP Ramudu  AP Govt  Recruitmement of police  Police recruitment  

Other Articles