Air Costa, Jet Airways announce discounts for 69th Independence Day

Airlines roll out independence day offers

Airlines roll out Independence Day offers, jet airways,air costa,69th independence day,domestic and international flights,announce discounts,after ecommerce companies,national, Independence Day offers, Airlines,economy, business and finance, business

To celebrate India's 69th Independence Day, the airlines, on domestic and international flights, are offering discounts after the ecommerce companies.

స్వతంత్ర దినోత్సవ వేళ ఎయిర్ లైన్స్ ఆఫర్లు

Posted: 08/11/2015 06:14 PM IST
Airlines roll out independence day offers

భారత్ దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు ఎయిర్ లైన్స్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి. ఎయిర్ కోస్తా సహా జెట్ ఎయిర్ వేస్ ఈ రాయితీలను ప్రకటించన వాటిలో ముందువరుసలో వున్నాయి. ఎయిర్ కోస్తా ప్రతీ టిక్కెట్ ధరపై 609 రూపాయలను మినహాయింపు కల్పిస్తుండగా, జెట్ ఎయిర్ వేస్ మాత్రం. దేశీయ, అంతర్జాతీయ నెట్‌వర్క్‌లోని సర్వీసుల్లో బేస్‌ ధరపై 30 శాతం డిస్కౌంట్‌ (పన్నులు మినహాయించుకుని) ఇస్తున్నట్లు తెలిపింది. ఫస్ట్‌ క్లాస్‌, ప్రీమియర్‌, ఎకానమీ తరగతులకు ఈ ఆఫర్‌ వర్తిస్తుందని తెలిపింది. ఈ నెల 14 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.

జెట్ ఎయిర్ వేస్ లో ఆఫర్‌లో టికెట్లను బుక్‌ చేసుకున్న ప్రయాణికులు ఈ ఏడాది సెప్టెంబర్‌ 10 నుంచి 2016 ఏప్రిల్‌ 14 వరకు ఎప్పుడైనా ప్రయాణించవచ్చని జెట్‌ ఎయిర్‌వేస్‌ పేర్కొంది. కాగా ఎయిర్ కోస్తా కూడా ఈ నెల 14 వరకు డిస్కౌంట్ ఆఫర్ లో టిక్కెట్లను విక్రయించనుంది. ఈ ఆఫర్ కింద టకెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు ఈ ఏడాది ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 30 లోపు ఎప్పుడైనా ప్రయాణించవచ్చునని ఎయిర్ కోస్తా తెలిపింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Independence Day offers  Airlines  economy  business and finance  business  

Other Articles