Congress will fight for AP special status, says Raghuveera

Congress will regain lost ground says raghuveera

Congress will fight for AP special status, Congress will regain lost ground, Andhra Pradesh, special status, Raghuveera Reddy, AP congress committee, Congress, regains

APCC president N. Raghuveera Reddy said that the party would regain the lost ground.

ప్రత్యేకహోదా సాధించే వరకు పోరాడుతాం.. రఘువీరా

Posted: 08/07/2015 07:32 PM IST
Congress will regain lost ground says raghuveera

నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా సాధించే వరకు రాష్ట్ర ప్రజల తరుపున తమ పార్టీ పోరాడుతుందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా సాదనలో అవసరమైతే తాము అన్ని పార్టీలను కలుపుకుని ఐక్యవేదికను కూడా ఏర్పాటు చేసి ముందుకుపోతామన్నారు. పార్టీ బలోపేతానికి... ప్రత్యేక హోదాకు సంబంధం లేదని ఆయన అన్నారు. రాష్ర్టానికి ప్రత్యేక హోదా అమలుపర్చాలని గతంలోనే మోదీకి సోనియా తొలిలేఖ రాశారని తెలిపారు. రాహుల్‌ గాంధీ పర్యటనతో అన్ని పార్టీలు ప్రత్యేక హోదాపై ముందుకు వచ్చాయని రఘువీరా అన్నారు.
 
ప్రత్యేక హోదా అనేది ప్రజల అజెండా అని చెప్పారు. టీడీపీ, వైసీపీ నేతల తీరు చేతకానమ్మకు చేతలు మెండు అనే విధంగా ఉందని విమర్శించారు. దేశంలో 11 రాష్ర్టాలకు ప్రత్యేక హోదా ఇచ్చారని అయితే ఏ రాష్ర్టానికి చట్టరూపం దాల్చలేదు...అన్నీ కేబినెట్‌ నిర్ణయం ప్రకారమే జరిగాయన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని వైసీపీ అసెంబ్లీలో సైతం లేవనెత్తలేదని మండిపడ్డారు. అటు టీడీపీ పార్టీ కూడా పార్టీ మహానాడులో అనేక తీర్మాణాలను చేసిందని కానీ ప్రత్యేక రాష్ట్ర హోదాపై మాత్రం తీర్మీణం చేయాలేదని ఆయన గుర్తుచేశారు. ప్రత్యేక హోదా, పోలవరం సాధించడమే తమ పార్టీ లక్ష్యమని రఘువీరారెడ్డి పునుద్ఘాటించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  special status  Raghuveera Reddy  AP congress committee  

Other Articles