Federal Bank | One min | Bank Account

Get bank account with in one minute

Federal Bank. One min, Bank Account, Account in one min, Banking

Get Bank account with in one minute. faderal Bank introducing one min. account opening facility.

ఒక్కటే నిమిషంలో బ్యాంక్ అకౌంట్

Posted: 08/07/2015 03:55 PM IST
Get bank account with in one minute

బ్యాంక్ అకౌంట్ తీయాలంటే గతంలో వారాలు వారాలు బ్యాంకుల చుట్టూ తిరగాలి. బ్యాంకులో ఉద్యోగులు ఎప్పుడు ఒకే అంటే అప్పుడు అప్లికేషన్ ఫాం ఇస్తారు. ఇక అన్ని ఫార్మాల్టిలు కంప్లీట్ చేసి అకౌంట్ చేతికొచ్చేసరికి తల ప్రాణం తోకకొస్తుంది. ఈ మధ్యన కాస్త బెటర్ గా ఉంది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన లో భాగంగా అందరికి అకౌంట్లు ఇచ్చేస్తున్నారు. కానీ అలా అయినా సరే కనీసం రెండు వారాలు ఆగకతప్పదు. కానీ అవే అకౌంట్ ఒకటంటే ఒకటే నిమిషంలో వచ్చేస్తే ఎలా ఉంటుంది..? ఏంటీ జోక్ చేస్తున్నారా.. అని అనుకోకండి. ఇది అక్షరాల నిజం. నిజంగానే నిజం నిమిషంలో అకౌంట్ వచ్చేస్తోంది. అసలు మ్యాటర్ ఏంటో చూడండి.

సహజంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే చాలా దరఖాస్తులు పూర్తి చేయాలి. వాళ్లకు కావల్సిన వివరాలు అన్నీ పూరించాలి. ఏవైనా తప్పులు ఉంటే.. అటెస్ట్‌ చేయించి సమర్పించాలి. అందుకే.. చాలా మంది కొత్తగా ఖాతా తెరవాలంటే.. అదో ప్రహసనంలా చిరాకు పడతారు. కానీ ఇకపై అలా కాదు.. కేవలం ఒకే ఒక్క నిమిషంలో బ్యాంక్‌ అకౌంట్‌ ఓపెన్ చేయెచ్చు. బ్యాంక్‌ అకౌంట్‌ ఓపెన్ చేయటం చాలా ఈజీ అంటోంది ఫెడరల్‌ బ్యాంక్. దీనికి మీరు చేయాల్సిందల్లా.. మీ దగ్గర స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు. ప్లే స్టోర్‌లో నుంచి ఫెడరల్‌ బ్యాంక్‌ ఆప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని సెల్ఫీ ఫొటోతో పాటు, ఆధార్‌ నెంబర్‌ ఎంటర్‌ చేస్తే చాలు. మీ అకౌంట్ వెంటనే ఓపెన్ అయిపోతుంది.

రెండు రోజుల్లో మీ ఇంటికి డెబిట్‌ కార్డు కూడా వచ్చేస్తుంది అని ఫెడరల్‌ బ్యాంక్ అంటోంది. ఇది పేపర్‌లెస్‌ వర్క్ అని.. చాలా టైమ్‌, కస్టమర్‌ తనంతట తనే ధృవీకరణ ఇవ్వటం జరుగుతుందంటున్నారు. దీంతో పాటు, మీకు ఈ పాస్‌ బుక్‌ అప్లికేషన్‌ కూడా వస్తుంది. దీనివల్ల.. బ్యాంకుకు ప్రతిసారీ వెళ్లాల్సిన అవసరం లేకుండా.. ఈపాస్‌ బుక్ ద్వారా జమాఖర్చులు చూసుకోవచ్చు. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లపై లభిస్తోందని ఫెడరల్‌ బ్యాంక్‌ అంటోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Federal Bank. One min  Bank Account  Account in one min  Banking  

Other Articles