AP | Anganwadi | Salary | Yanamala

Ap govt will hike the salaries to anganwadi wokers

AP, Anganwadi, Salary, Yanamala Ramakrishnudu, Anganwadi salary

AP Govt will hike the salaries to AnganWadi wokers.Cebinet sub committee decided propose to hike the salaries of Anganwadi workers near to double.

ఏపిలో అంగన్ వాడీలకు జీతాలు డబుల్

Posted: 08/07/2015 08:32 AM IST
Ap govt will hike the salaries to anganwadi wokers

సెప్టెంబర్‌ నుండి ఏపిలో అంగన్‌వాడీ సిబ్బంది వేతనాలు పెరగనున్నాయి. అంగన్‌వాడీ వర్కర్‌తోపాటు ఆయాలకు వేతనాలు పెంచాలని మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదించింది. ఉపసంఘం తన నివేదికను ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడుకి అందజేసింది. కమిటీ నివేదికను సమర్పించిన అనంతరం మంత్రులు అచ్చెన్నాయుడు, పీతల సుజాత సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. అంగన్‌వాడీ సిబ్బంది వేతనాలను పెంచాలని మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనలు సిద్దం చేసిందని మంత్రులు తెలిపారు.

ప్రస్తుతం అంగన్‌వాడీ వర్కర్‌కు నెలకు 4200 ఇస్తున్నారని, దానిని  7100కు పెంచు తున్నట్టు తెలిపారు. మిని అంగన్‌వాడీ వర్కర్‌కు ప్రస్తుతం 2950 ఇస్తుండగా దానిని 4600, ఆయాకు ప్రస్తుతం 2400 ఇస్తుంటే అది కూడా 4600 పెంచాలని నిర్ణయించినట్టు తెలిపారు. అంగన్‌వాడీ సిబ్బందికి పెంచిన వేతనాల మూలంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి  317 కోట్ల భారం పడుతుందని మంత్రులు చెప్పారు. ప్రస్తుతం ఏడాదికి  406 కోట్ల ఖర్చు అవుతుండగా వేతనాలు పెరిగిన అనంతరం అదికాస్త  723కోట్లు అవుతుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంగన్‌వాడీలకు ఇచ్చిన హామి మేరకు వేతనాలు పెంచాలని మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిం చిందన్నారు. సీఎం విదేశీ పర్యటన నుండి రాగానే దీనిపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

రానున్న మంత్రివర్గ సమావేశంలోనూ చర్చించిన అనంతరం సెప్టెంబర్‌ నెల నుండి పెరిగిన వేతనాలను అమలు చేస్తామని మంత్రులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 1,04, 377 మంది అంగన్‌వాడీ సిబ్బంది ఉన్నా రని మంత్రులు తెలిపారు. మాతాశిశు మరణాల తగ్గింపులో అంగన్‌ వాడీల పాత్ర చాలా కీలకమని మంత్రి పీతల సుజాత తెలిపారు. అంగన్‌వాడీలకు అదనపు పనులను అప్పగించ వద్దని నిర్ణయించి నట్టు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలను ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు తెరచి ఉంచాలని పాలుతాగే పిల్లలకు పోషకాహారం అందించడం, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందిం చాలని మంత్రి సూచించారు. వేతనాలు పెరిగిన నేపథ్యంలో అంగన్‌ వాడీలు ఇంకా బాగా పనిచేయాలని మంత్రి సుజాత ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  Anganwadi  Salary  Yanamala Ramakrishnudu  Anganwadi salary  

Other Articles