I am the unfortunate father of Udhampur attacker, says Pakistan-based man

Pakistan man admits he is naved s unfortunate father says let after their family

Border Security Force, Pakistan, Mohammad Naved, Usman Khan, Udhampur, India, Jammu and Kashmir, Lashkar-e-Toiba, Ajmal Kasab, Pakistan terrorism, Terrorism, Faisalabad, Naved's father, Pakistani terrorist, Udhampur attack, BSF convoy attack, Mohammed Naved, Mohammed Yakub, LeT Pakistani terrorist caught alive

Ripping apart Islamabad's lie once again, a Pakistan-based man has claimed that the captured militant in Udhampur, the second such since Ajmal Kasab was nabbed during the 2008 Mumbai terror attack, is his son

వాడు నా బిడ్లే.. ఆ దురదృష్టవంతుడిని నేనే: ఉగ్రవాది నవెద్ తండ్రి..

Posted: 08/06/2015 11:05 PM IST
Pakistan man admits he is naved s unfortunate father says let after their family

అస్మల్ కసబ్ భారత బాలగాలకు దోరికినప్పుడు తమ దేశస్థుడే కాదని బుకాయించిన పాకిస్థాన్, నావెద్ సజీవంగా భద్రతాదళాలకు దొరికన తరువాత కూడా మరోమారు అదే నైజాన్ని భయటపెట్టినా.. పాకిస్థాన్ లోని ఫైసలాబాద్ కు చెందిన ఓ వ్యక్తి మాత్రం నవెద్ తన బిడ్డేనని తెలిపాడు. అతనే సజీవంగా పట్టబడ్డ మరో ఉగ్రవాది నవెద్ తండ్రి యాకుబ్ ఖాన్‌. విచారణలో నావెద్ ఇచ్చిన నెంబరుకు ఫోన్ చేసినప్పుడు అతడి తండ్రి యాకుబ్ ఖాన్ ఫోన్ ఎత్తారు. ఫైసలాబాద్‌లోని స్థానిక చెస్తే పంజాబీ భాషలో మాట్లాడిన యాకుబ్ ఖాన్ తన కుమారుడిని క్షమించాలని వేడుకున్నాడు. లష్కర్ ఎ తొయిబా నావెద్‌ చనిపోవాలని కోరుకుందని, అయితే తమ కుమారుడు సజీవంగా పట్టుబడటంపై ఆయన ఒకరకంగా సంతోషం వ్యక్తం చేశాడు.

ఉగ్రవాద సంస్థ లష్కర్ కుట్రలకు తాము, తమ బిడ్డలు బలిపశువులవుతున్నామని ఆయన ఆక్రోశాన్ని ఆయన మాటలు వెల్లడిస్తున్నాయి. ఉగ్రవాది నావెద్ తమ జాతీయుడు కాదని పాకిస్థాన్ బుకాయించినా అతడి తండ్రి యాకుబ్ ఖాన్ మాత్రం నావెద్ తన కోడుకేనని అంగీకరించాడు. నావెద్ తన కుమారుడేనని, అతడిని కన్న దురదృష్టవంతుడిని తానేనన్నాడు. ఫైసలాబాద్‌కు మీడియా ప్రతినిధులు ఫోన్ చేసి వివరాలడుగగా ఫోన్‌లో మాట్లాడేందుకు ఆయన భయపడిపోయాడు. తనను పాకిస్థాన్ ఆర్మీ, ఐఎస్ఐ, లష్కర్ ఎ తొయిబా వెంటాడుతున్నాయన్నాడు. తనకు ప్రాణహాని ఉందని చెప్పాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Udhampur attack  Mohammed Naved  Yakub  LeT Pakistani terrorist caught alive  

Other Articles