ysrcp mla roja takes on chandrababu naidu

Ysrcp nija nirdharana committee protests in nagarjuna university

Roja, Ysrcp mla, rishiteswari death, nagarjuna university, Breaking news, general, politics, sport, entertainment, lifestyle, weird, world, india news, entertainment news, polavaram, national news, telugu news

ysrcp nija nirdharana committee protests in nagarjuna university says to add principal baburao as main accused in rishiteswari case

బాబు పాలనలో మహిళలకు రక్షణ కరువు.. ఏం జరిగినా సెటిల్ మెంటు..

Posted: 08/06/2015 08:49 PM IST
Ysrcp nija nirdharana committee protests in nagarjuna university

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సెటిల్మెంట్ సీఎంగా మారిపోయారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఎన్నికల ముందు నోటి నుంచి మాట వచ్చిన ప్రతీసారి ఆడవాళ్లను, అక్కచెలెళ్లు అంటూ ప్రస్తావించి..  అధికారంలోకి వచ్చిన ఆయన.. తన పాలనలో అక్కాచెలెళ్లకే సవాళ్లు ఏర్పడిందే, మానప్రాణాలకు రక్షణ కరువవుతుంటే.. నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తున్నారని విమర్శించారు. ఎమ్మార్వో వనజాక్షి విషయంలో ఆమెను ఇంటికి పిలిపించి సెటిల్మెంట్ చేశారని, ఇక ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి తల్లిదండ్రులకు రూ.10లక్షల నగదు, 500 గజాల భూమిని ఇచ్చి సెటిల్ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఓ ఆడపిల్ల జీవితం ఖరీదు రూ.10లక్షలా అని రోజా సూటిగా ప్రశ్నించారు. మహిళల ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు...ఇప్పుడు మహిళల సమస్యల గురించి పట్టించుకోవడం లేదని ఆమె మండిపడ్డారు.

రిషితేశ్వరి ఆత్మహత్య కేసును ప్రభుత్వం డబ్బులతో సెటిల్ చేయాలని చూస్తుందని ఆమె ఆరోపించారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యపై ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ గురువారం యూనివర్శిటీకి వెళ్లింది. అయితే కమిటీలోని మహిళ ఎమ్మెల్యేలు, నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.... రిషితేశ్వరీ ఆత్మహత్య కేసులో కళాశాల ప్రిన్స్పాల్ బాబురావు ప్రధాన ముద్దాయిగా చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అధికార పార్టీ అండతోనే ప్రిన్సిపల్ రెచ్చిపోయాడని ఆమె విమర్శించారు. క్యాంపస్లో ర్యాగింగ్ జరుగుతుందని విద్యార్థులు ప్రిన్సిపాల్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసిన ఆయన పట్టించుకోలేదన్నారు. విద్యార్థులకు విద్యాబుద్దలు నేర్పాల్సిన ప్రిన్సిపాల్.. వారితో కలసి నైట్ క్లమ్ లకు వెళ్లి తెల్లవారేదాకా తైతక్కలు అడే బాబురావు ప్రిన్సిపాల్ ఎలా అవుతాడని ఆమె ప్రశ్నించారు. రిషితేశ్వరి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వదిలి పెట్టమని రోజా స్పష్టం చేశారు. ఈ కేసులో నిజానిజాలు వెలుగు చూడాలంటే.. నిప్పక్షపాత్ర విచారణ అవసరమని డిమాండ్ చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Roja  Ysrcp mla  rishiteswari death  nagarjuna university  

Other Articles