Hiroshima | 70Years | Atom Bomb

Hiroshima marks 70 years since atomic bomb

Hiroshima, Atom Bomb, Japan, America, Nagasaki, Atom bomb on Japan, Atom Bomb attack

Hiroshima marks 70 years since atomic bomb Residents in the Japanese city of Hiroshima are commemorating the 70th anniversary of the first atomic bomb being dropped by a US aircraft.A ceremony, attended by PM Shinzo Abe, was held at Hiroshima's memorial park before thousands of lanterns are released on the city's Motoyasu river.

ITEMVIDEOS: హీరోషిమా దాడికి నేటికి 70 ఏళ్లు

Posted: 08/06/2015 04:35 PM IST
Hiroshima marks 70 years since atomic bomb

జపాన్‌ దేశంలోని హీరోషిమా నగరంలో అణు బాంబు దాడికి ఘటనకు మృతి చెందిన వారికి భారత ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. ఆయన తన ట్విట్టర్ ద్వారా నివాళులను తెలిపారు. జపాన్ దేశంలోని ప్రధాన నగరమైన హిరోషిమా నగరంపై అణుబాంబు దాడి జరిగిన ఆగస్టు ఆరో తేదికి 70 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ అప్పుడు మృతి చెందిన ప్రజలకు నివాళులు తెలిపారు.  ఆయన తన ట్విట్టర్‌లో నివాళులను అర్పించారు. హిరోషిమా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారందిరికీ తన శ్రద్ధాంజలి. నాటి బాంబు ఘటన యుద్ధాల వల్ల సంభవించే భయంకర దృశ్యాలను, మానవత్వంపై పడే ప్రభావాన్ని మనందరికీ గుర్తుకు తెస్తుందని మోడీ తన ట్విట్టర్‌లో తెలిపారు.


 
1945లో రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశకు చేరుకున్న సమయంలో జపాన్‌పై అమెరికా ఈ అణుబాంబు దాడికి పాల్పడింది. కొన్ని క్షణాలకే హిరోషిమా నగరం మొత్తం నేలమట్టమైంది. తరువాత కొన్ని రోజులకే అంటే అదే ఏడాది ఆగస్టు 9న నాగసాకి నగరంపై కూడా అమెరికా రెండో అణుబాంబును ప్రయోగించి ధ్వంసం సృష్టించింది.  జపాన్ ప్రధాని షింజో అబేతో పాటే దేశ విదేశీ ప్రముఖులు మరియు వేలాది మంది షిరోషిమాలోని పీస్ మెమోరియల్ పార్క్‌లో ఈ ఉదయం కొద్ది క్షణాలు మౌనం పాటించారు. అణ్వాయుధం లాంటి చెడ్డది ఈ ప్రపంచంలోనే లేదని, వాటిని నిర్మూలించాలని హిరోషిమా మేయర్ కజుమి మత్సుయ్ పిలుపునిచ్చారు.

జపాన్‌పై అణు బాంబు దాడిపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఆ బాంబు దాడి జరగనైట్లెతే లక్షలాది మంది అమాయకుల ప్రాణాలను జపాన్ తను ఆక్రమించిన ప్రాంతాలలో బలి తీసుకునేదని అణు బాంబు దాడిని సమర్ధించే వాళ్ళు అంటారు. జపాన్ ఓటమి దశలో ఉండి లొంగిపోవడానికి సిద్ధ పడ్తున్నపుడు అణు బాంబును ప్రయోగించడం ఎంత వరకు సమంజసం అని దాన్ని వ్యతిరేకించేవారి వాదన. ప్యూ రీసెర్చ్ సెంటర్ జరిపిన సర్వేలో 56% మంది అమెరికన్లు అణు దాడి సబబే అనగా, అది ఎంత మాత్రం సమ్మతం కాదని 79% జపానీయులు చెప్పారు. ఏదేమైనా జపాన్‌పై అమెరికా అణు దాడి జరిగిన రోజు ప్రపంచ చరిత్రలో అత్యంత దుర్దినం. అయితే ఆనాడు వల్లకాడుగా మారిన హిరోషిమా కాలం మిగిల్చిన విషాధాన్ని దిగమింగుకొని ఒక్కటంటే ఒక్కటే మిగిలిన ఆనాటి భవనం జన్‌బకూ డోమ్ సాక్షిగా ప్రగతి వైపు ఉరకలెత్తుతోంది. ఇప్పుడు ఆ నగరంలో 12 లక్షల మంది నివసిస్తున్నారు. రెండు అంతర్జాతీయ విమానాశ్రయాతో, ఎత్తైన ఆకాష హార్మ్యాలతో అలరారుతూ జపాన్‌లో అభివృద్ధి చెందిన నగరాలలో ఒకటిగా నిలిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hiroshima  Atom Bomb  Japan  America  Nagasaki  Atom bomb on Japan  Atom Bomb attack  

Other Articles