ISIS abducted Indian Professors released

Another two of four kidnapped indians released in libya by isis

ISIS abducted Indian Professors released, Another Two of four kidnapped Indians released in Libya by ISIS, telangana, four indians, kidnap, isis, libya, sources, gopi krishna, balaram, kalyani, indian professors, telugu professors, released, indian embassy in libya, ISIS terrorists, gopi krishna, balaram released

Another Two of four kidnapped Indians released in Libya by ISIS terrorists released today and they bought to indian embassy in libya

లిబాయాలో తెలుగు ఫ్రోఫెసర్లకు విముక్తి.. విడుదల చేసిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు

Posted: 08/05/2015 07:16 PM IST
Another two of four kidnapped indians released in libya by isis

లిబియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల చెరలో బందీలుగా ఉన్న తెలుగు ప్రొఫెసర్లకు ఎట్టకేలకు విముక్తి లభించింది. తమ వారికి ఎలాంటి హాని తలపెట్టకుండా.. క్షేమంగా విడిచిపెట్టాలని తెలుగు ప్రోఫెసర్ల కుటుంబ సభ్యలు భగవంతుడికి పెట్టుకున్న విన్నపాలు తీరాయి.  ఎలాంటి హాని జరగకుండానే ఉగ్రవాదల చెర నుంచి తెలుగు ఫ్రోఫెసర్లు విముక్తి పోందారు. తమకు విద్యాబుద్దులు చెప్పిన తెలుగు ప్రోఫెసర్లను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఎట్టకేలకు విడుదల చేశారు. గత వారం రోజులుగా ఉగ్రవాదుల చెరలో వున్న తెలుగు ఫ్రోఫెసర్లకు ఇవాళ విముక్తి లభించింది.

ఉగ్రవాదులు చెర నుంచి విడుదలైన తెలుగు ఫ్రోఫెసర్లను లిబియాలోని భారత దౌత్య కార్యాలయానిక తరలించినట్టు ఢిల్లీలో అంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ తెలిపారు. తెలుగు ఫ్రోఫెసర్లు బలరాం, గోపికృష్ణలను విడుదల చేసినట్లు విదేశాంగ శాఖ ద్వారా సమాచారం అందిందని ఆయన చెప్పారు. త్వరలోనే ఇద్దరు తెలుగువారిని భారత్‌కు తీసుకువస్తామని తెలిపారు. ఈ ప్రొఫెసర్ల విడుదల సమాచారం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు తమ ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

తెలుగు ప్రొఫెసర్ల గురించి ఆందోళన చెందవద్దని, వారిని బాగా చూసుకుంటామని ఐఎస్ ఉగ్రవాదులు హామీ ఇచ్చినట్లు అక్కడి నుంచి భారత్ తిరిగివచ్చిన కర్ణాటక ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రామకృష్ణ బెంగుళూరులో మీడియాతో చెప్పిన మరుసటి రోజునే ప్రొఫెసర్లు బలరాం, గోపీకృష్ణలను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు విడిచిపెట్టారు. క్షేమ సమాచారం అందడంతో తెలుగు ప్రోఫెసర్ల కుటుంబ సభ్యులలో ఆనందం వెల్లివిరుస్తోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telugu professors  released  kidnap  isis  libya  gopi krishna  balaram  

Other Articles