Congress MPs' suspension unites opposition, 9 parties to boycott House

Congress protests against suspension of 25mps

BJP, Congress, India, Lok Sabha, parliament, Rahul Gandhi, Samajwadi Party, Sumitra Mahajan, suspension, Vasundhara Raje, Trinamool Congress, Tariq Anwar, Sushma Swaraj, Supriya Sule, Sumitra Mahajan, Sonia Gandhi, Shivraj Singh Chouhan, Sharad Pawar, samajwadi party, manmohan singh

Congress President Sonia Gandhi shouts slogans at the parliament against the suspension of their 25 members by the Lok Sabha Speaker

ఎంపీల సస్పెషన్ పై కాంగ్రెస్ నిరసన, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

Posted: 08/04/2015 11:28 PM IST
Congress protests against suspension of 25mps

కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శించారు. లోక్‌సభ నుంచి 25 మంది కాంగ్రెస్‌ ఎంపీల సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా మంగళవారం పార్లమెంట్‌ ఆవరణలో కాంగ్రెస్‌ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా సోనియాగాంధీ మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటును నడపడం ప్రభుత్వం బాధ్యత అని.. కానీ ఈ విధంగా కాంగ్రెస్‌ ఎంపీలను సస్పెండ్‌ చేయడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని అన్నారు. తాము అధికారంలో వున్నప్పుడు విపక్ష బిజేపి నెల రోజుల పాటు సభాకార్యక్రమాలను అడ్డుకున్నా తాము వారిని సస్పెండ్ చేయలదేని విషయాన్ని గుర్తచేశారు.

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ పార్లమెంట్‌ను సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు. ప్రతిపక్షాల ఆందోళనలను అర్ధం చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని ఆయన అన్నారు. పార్లమెంటరీ సంప్రదాయాలను, ఉన్నత ప్రమాణాలను మంత్రులు పాటించేలా ప్రభుత్వం చూడాలని ఆయన సూచించారు. ఒక కేంద్రమంత్రి, ఇద్దరు ముఖ్యమంత్రుల ప్రవర్తన దేశానికి సిగ్గు చేటుగా నిలిచిందని ఆయన విమర్శించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు రాజీనామా చేయాలన్న మా డిమాండ్‌ పూర్తిగా న్యాయబద్ధమైనదని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు.

కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ లోక్‌సభలో ప్రభుత్వ తీరుపై దేశవ్యాప్తంగా మా అందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు, రైతులు అందరితో కలిసి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. సామాజిక, మాధ్యమాల ద్వారా కూడా ఆందోళనలు కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. అవినీతికి వ్యతిరేకంగా, వ్యాపం అంశంపై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వ్యవహారంపై.. కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ వ్యవహారంపై కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గబోమని రాహుల్‌ స్పష్టం చేశారు.

విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కాంగ్రెస్ పార్లమెంటరీపక్ష నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. లోక్‌సభ నుంచి 25 మంది కాంగ్రెస్‌ ఎంపీల సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా మంగళవారం పార్లమెంట్‌ ఆవరణలో కాంగ్రెస్‌ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి పని మోదీ ప్రభుత్వం చేయిస్తోందని విమర్శించారు. మోదీ సర్కార్‌ ఒత్తిడితో విపక్షాలను సస్పెండ్‌ చేసి పార్లమెంట్‌ను నడపాలని అనుకోవడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని ఆయన అన్నారు. వ్యవస్థను నాశనం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆయన మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress  parliament  Rahul Gandhi  sonia gandhi  manmohan singh  

Other Articles