Modi government | Central | Naga Militant groups

Centre signs pact in effort to resolve 60yr naga conflict

NSCN, Modi government, Central, Naga Militant groups, PM Narendra Modi, announces, historic peace pact

Centre signs pact in effort to resolve 60yr Naga conflict Prime Minister Narendra Modi’s peace deal with Nagaland insurgents which he announced Monday rests on a breakthrough formula which does not involve redrawing the state’s borders, highly placed government

నాగా తిరుగుబాటుదారులతో కేంద్రం శాంతి ఒప్పందం

Posted: 08/04/2015 12:30 PM IST
Centre signs pact in effort to resolve 60yr naga conflict

65 ఏళ్లుగా నాగాలు చేస్తోన్న  పోరాటానికి తెరపడింది. నాగా తిరుగుబాటుదారులతో.....  కేంద్రం చారిత్రక శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నాగా తిరుగుబాటు సంస్థ....  ఎన్ఎస్‌సీఎన్‌లో రెండు వర్గాలున్నాయి. ప్రస్తుతం బలమైన వర్గమైన ఐజాక్‌ మోయివాతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది భారత్‌. ప్రధాని మోడీ సమక్షంలో మోయువా, భారత ప్రభుత్వ ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు.  NSCNలోని రెండో వర్గంమైన ఖప్లాంగ్‌ను భారత్‌ నిర్మూలించడంతో  మోయివాతో శాంతి ఒప్పందం సాధ్యపడింది.

నాగాలకు, భారతీయులకు మధ్య సత్సంబంధాలను నెలకొల్పడంలో మోడీ సర్కారు చూపిన ఈ చొరవను ప్రశంసించారు మోయువా. పీవీ హయంలో చర్చలు మొదలయ్యాయని, వాజ్‌పేయి  ఈ చర్చల ప్రక్రియను కొనసాగించారని గుర్తు చేశారు మోయూవా. ఈ చారిత్రక ఒప్పందంలో నాగా ప్రజల కృషి ఎనలేనిదన్నారు ప్రధాని మోడీ.  ఇది భారత ప్రజాస్వామ్య పరిణితికి సూచికగా వర్ణించారు. నాగా ప్రజలంతా అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్లేందుకు ఇదో సువర్ణ అవకాశమన్నారు మోడీ.

పీవీ హయాంలో నాగా తిరుగుబాటుదారులతో చర్చలు జరపాలన్న నిర్ణయం జరిగింది. ఆ తర్వాత నాగాలకు తగిన గౌరవం ఇవ్వాలని అప్పటి  వాజ్‌పేయీ నిర్ణయించారు. చివరికి, మోడీ హయంలో ఈ శాంతి ఒప్పందం కుదిరింది. ఈ చారిత్రక నిర్ణయంతో ఇక నాగాలు, భారతీయుల మధ్య శాంతి చిగురుస్తుందంటున్నారు రాజకీయ నిపుణులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles