Congress President Sonia Gandhi Controversial Comments On Narendra Modi | Parliament Session | India Scams

Sonia gandhi controversial comments on narendra modi parliament session

sonia gandhi, narendra modi, indian scams, sonia gandhi latest news, sonia gandhi updates, sonia gandhi controversy, narendra modi, narendra modi controversies, narendra modi updates, coal scam news, lalit modi money scam

Sonia Gandhi Controversial Comments On Narendra Modi Parliament Session : Congress President Sonia Gandhi Controversial Comments On Narendra Modi Before Attending The Parliament Sessions.

‘ఏమయ్యా మోదీ.. ఇప్పుడు నోరు విప్పవేం’

Posted: 08/03/2015 01:53 PM IST
Sonia gandhi controversial comments on narendra modi parliament session

సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఘోరంగా పరాజయంపాలవడంతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇన్నాళ్లూ మౌనం పాటిస్తూ వచ్చారు. బీజేపీపై దండయాత్ర చేసే సమయం తనకూ రాదా..? అంటూ వేచి చూశారు. ఇప్పుడు ఆ అవకాశం రావడంతో ఆమె బీజేపీపై డైరెక్ట్ అటాక్ చేశారు. ఈరోజు (సోమవారం) పార్లమెంట్ సమావేశాలకు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన సోనియా.. నరేంద్రమోదీ పేరును ప్రస్తావిస్తూ ప్రత్యక్ష విమర్శలు చేశారు. పార్లమెంటు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఆమె... ఆయనపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.

భారతదేశంలో పాలన పూర్తిగా స్తంభించిపోయిందని పేర్కొన్న సోనియాగాంధీ.. ఎన్నికలకు ముందు మోదీ ఇచ్చిన హామీలను మరచిపోయారని, వాటిల్లో ఏ ఒక్కదాన్నీ ఇంతవరకు నెరవేర్చలేదని అన్నారు. ‘మన్ కీ బాత్’ చాంపియన్ గా పేరుగాంచిన ఆయన.. తన సహచరులు జరిపిన కుంభకోణాలపై ఎందుకు ‘మౌన వ్రతం’ పాటిస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. ఇదివరకే అమలులో వున్న పాత పథకాలకు కొత్త రంగు పులమడంలో ఆయనకు ఆయనే సాటని ఆమె అభివర్ణించారు. ఈ విషయంలో నిపుణుడైన సేల్స్ మెన్ గా, తెలివైన న్యూస్ మేనేజర్ గా, పత్రికల హెడ్ లైన్లలో స్థానం సంపాదించే వ్యక్తిగా మోదీ నిలిచారని సోనియా పేర్కొన్నారు.

తాను నిజాయితీగా ఉంటానని, పారదర్శకత పాటిస్తున్నానని మోదీ చెప్పుకోవడమే తప్ప.. తన విదేశాంగ శాఖ మంత్రి, ఇద్దరు ముఖ్యమంత్రుల విషయంలో ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదో వివరించాలని కోరారు. యూపీఏ పాలన సమయంలో ‘ముందు రిజైన్ - తరువాతే చర్చ’ అన్న నినాదాన్ని బీజేపీ తెరపైకి తెచ్చిందని గుర్తుచేసిన ఆమె.. ఇప్పుడు తాము దాన్నే పాటిస్తున్నామని అన్నారు. తాము ఎంతో ముఖ్యమైన విషయాన్ని బలమైన సాక్ష్యాలతో సహా వినిపించాలని చూస్తుంటే, ప్రభుత్వం ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయడం లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ మంత్రులు, ముఖ్యమంత్రులు రాజీనామాలు చేసేదాకా నిరసనలు కొనసాగిస్తూనే వుంటామని ఆమె స్పష్టం చేవారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సభ కొనసాగనివ్వబోమంటూ ఆమె హెచ్చరించారు. సభలో మెజారిటీ వున్నంతమాత్రాన తప్పులు ఒప్పులైపోవని ఆమె విమర్శించారు. మరి.. సోనియా చేసిన ఈ విధమైన ఘాటు వ్యాఖ్యలపై బీజేపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sonia gandhi  narendra modi  parliament session  

Other Articles