6 Years Girl Kidnapped By Woman In Film Nagar

Minor girl abducted in hyderabad film nagar

Minor girl abducted in Hyderabad, film nagar, 6 Years Girl Kidnapped By Woman In Film Nagar, minor girls, kidnapped, Hyderabad, film nagar, gandhi hospital, crime in hyderabad, kidnap in telangana, crime in telangana

abductions rock telugu states comman capital Hyderabad as two minors kidnapped in two days by unidentified ladies

ITEMVIDEOS: ఫిల్మ్ నగర్ లో తొమ్మిదేళ్ల చిన్నారిని అపహరణ

Posted: 08/02/2015 08:20 PM IST
Minor girl abducted in hyderabad film nagar

తెలంగాణ రాష్ట్రంలో చిన్నారుల కిడ్నాప్ లు కలకలం సృష్టిస్తున్నాయి. రెండు రోజుల క్రితం గాంధీ ఆసుపత్రి అవరణలో పడుకున్న ఓ తల్లి నుంచి బిడ్డను అపహరిచుకువెళ్లిన ఘటనను మరువక ముందే.. నగరంలోని ఫిలింనగర్‌, అంబేద్కర్‌నగర్‌లో ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్‌ కలకలం సృష్టించింది. స్కూల్‌ ముందు ఆడుకుంటున్న చైతన్య హరిణి అనే చిన్నారిని అడ్రస్‌ చూపించమంటూ ఓ గుర్తు తెలియని మహిళా తీసుకువెళ్లిపోయింది. ఆకుపచ్చ చూడీదార్‌లో వచ్చిన 21 ఏళ్ల అమ్మాయి పూజిత ఇళ్లు చూపించాలని అడిగి హరిణిని తీసుకువెళ్లినట్లు సహ విద్యార్థులు చెబుతున్నారు.

ఏమడినా ఇస్తాం. మా పాపను క్షేమంగా తిరిగి ఇప్పించండని హరిణి తల్లిదండ్రులు ఆభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా హరిణి తండ్రి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తమ పాపను తమకు అప్పగించాలని, మీరైనా ఆశిస్తే తనకు ఫోన్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. తన కుమార్తె అంటే ప్రాణమని, శనివారం రాత్రి నుంచి మా పాపని తలచుకుంటూ ఏడుస్తున్నామని ఆయన భోరున విలపించారు. ఆ పాపకు ఎటువంటి హానీ తలపెట్టవద్దని ఆయన కోరారు. శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు మహిళా అగంతకురాలి కోసం ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : minor girls  kidnapped  Hyderabad  film nagar  gandhi hospital  

Other Articles