Rishiteswari's parents objects 4-member Panel Probe during holidays

Three senior student who harassed rishitheswari arrested

Rishiteswari's parents objects probe, four-member committee inquiry, suicide’ of Rishiteswari, holidays, three senior students arrested, Nagarjuna university, retired bureaucrat, retired IAS officer S Balasubramaniam, remand dairy

Rishiteswari's parents objects the four-member committee inquiry into the ‘suicide’ of Rishiteswari during holidays. Police arrested three Nagarjuna university senior students who harrassed rishitheswari

రిషితేశ్వరి రిమాండ్ డైరీలో సంచలన విషయాలు.. విచారణను ఆపండి..

Posted: 07/30/2015 10:16 PM IST
Three senior student who harassed rishitheswari arrested

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలో జెడలు విప్సిన ర్యాగింగ్ భూతం అమాయక విద్యార్ధినిన పోట్టన పెట్టుకుందన్న విషయాన్ని పోలీసులు ధృవీకరించారు. ప్రస్తుతం నవ్యాంధ్ర రాష్ట్రాన్ని కుదుపేస్తోన్న రిషితేశ్వరి ఆత్మహత్యకు కారణం ఎవరు? ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందనేదానిపై అమె రిమాండ్ డైరీలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. తన సీనియర్ల చేతిలో అమె ఎలా చిక్కుకుందో.. వారి వేధింపులకు ఎలా భరించిందోనని పోలీసులు విస్మయానికి గురయ్యారు. రిషితేశ్వరి ఆత్మహత్యకు గల కారణాలన్నింటినీ  అమె రిమాండ్ డైరీలో పూసగచ్చినట్లు పోలీసులు వివరించారు.

నాగార్జునా యూనివర్సిటీలో మే 18న నిర్వహించిన ప్రెషర్స్‌ డే వేడుకల్లో రిషేతేశ్వరి పాల్గొనింది. ఈ క్రమంలో ఆమె పట్ల ముగ్గురు విద్యార్ధులు అసభ్యంగా ప్రవర్తించారు. ఫ్రేషర్స్ డే వేడుకల సాక్షిగానే అమె సీనియర్ల వేధింపులకు గురైంది. అంతటితో ఆగకుండా కొన్ని రోజుల పాటు రిషితేశ్వరీ వెంట పడి మానసికంగా, శారీరకంగా వేధించారని రిమాండ్‌ డైరీలో పోలీసులు పేర్కొన్నారు. పలుమార్లు అవమానించడంతో.....తీవ్ర మనస్తాపానికి గురైన రిషితేశ్వరి తల్లిదండ్రులకు కూడ చెప్పుకోకుండా తన హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెందినట్లు తెలిపారు. మధ్యాహ్నం తన సహచర విద్యార్థినులు వచ్చి చూసేసరికి అమె ఉరి వేసుకుని వుందని, అమెను హుటాహుటిన అస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందిందని వైద్యులు నిర్థారించారని రిమాండ్ డైరీలో పోలీసులు పేర్కోన్నారు. రిషితేశ్వరి మృతికి కారణమైన ముగ్గురు విద్యార్ధులను పోలీసులు అరెస్ట్ చేశారు

ఇదిలావుండగా, రిషితేశ్వరి ఆత్మహత్య ఉదంతంలో నిజాలను నిగ్గుతేల్చేందుకు ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల కమిటీ విచారణను ప్రారంభించడంపై మృతురాలి తల్లిదండ్రులు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునా విశ్వవిద్యాలయానికి పది రోజుల పాటు సెలవులను ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు విచారణ జరిపితే నిజాలు వెలుగులోకి రావని వారు అందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ ఆత్మహత్య కేసులో నిజాలు వెలుగుచూడాలంటే తరగతులు జరుగుతున్నప్పుడు విచారణ జరిపించాలని వారు కోరారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 3 seniors  harassement  rishitheswari  arrested  4 member committee  parents  

Other Articles