Abdul Kalam | Kalam | Abdul Kalam last journey

Nation bids a teary adieu former president apj abdul kalams last journey

Abdul Kalam, Kalam, Abdul Kalam last journey, Abdul Kalam last speech, Abdul kalam news, APJ Abdul Kalam

Nation bids a teary adieu Former President APJ Abdul Kalams last journey The mortal remains of former President A P J Abdul Kalam, who died on Monday, were taken from his ancestral house here to the local mosque ahead of the funeral as thousands of mourners young and old poured into the island town to pay their last respects.

ITEMVIDEOS: కలాంకు కన్నీటి వీడ్కోలు

Posted: 07/30/2015 11:12 AM IST
Nation bids a teary adieu former president apj abdul kalams last journey

అబ్దుల్ కలాం... ఇది పేరు కాదు భారతజాతి కీర్త పతాకాలను ప్రపంచపు ఆకాశపుటంచుల దాకా ఎగురవేసిన గొప్ప వ్యక్తి. బారతదేశం అంటే అబ్దుల్ కలాం ఒక్కరి వ్యక్తిత్వంలొ స్పురిస్తుంది అని అనేంతగా  అంచలంచెలుగా ఎదిగిన నిరంతర కర్మయోగి. విజయాలను చదవకండి.. అపజయాలను చదవండి అవే విజయాలనికి దారి చూపిస్తుంది అని అన్న గొప్ప మేధావి. కలలు కనండి.. వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడండి అంటూ లోకానికి కొత్త స్పూర్తిని రగిల్చిన గొప్ప మేధావి. స్రసంగిస్తు అకస్మాత్తుగా కుప్పకూలి... తిరిగి రాని లోకాలకు ప్రయాణం కట్టిన అబ్దుల్ కలాం ఆఖరి మజిలీకి అంతా సిద్దమైంది. రామేశ్వరంలో అబ్దుల్ కలాం అంతిమ సంస్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బారత ప్రజలు కంటి నిండా కన్నీటి బిందువులతో.. కలాం వదిలిన స్మృతులను తలుచుకుంటూ ఎన్నటికీ తిరిగి రారు అని తెలిసి శో్కంతో నిండిన మందిని కటువు చేసుకొని అబ్దుల్ కలాంకు కడసారి వీడ్కోలుకు భారత ప్రజలు సిద్దమయ్యారు.

ప్రధాని, ప్రధాన ప్రతిపక్ష నాయకులు, వివిధ రాష్ట్రాల గవర్నర్ లు, ముఖ్యమంత్రులు, అబ్దుల్ కలాం కుటుంబ సభ్యులు, లెక్కకు లేనంత మంది అభిమానుల మధ్య అబ్దుల్ కలాం అంతిమ యాత్ర సాగింది. ప్రజా రాష్ట్రపతి అన్న ముద్రతోనో, గొప్ప మేధావి గానో, గొప్ప కవిగానో, గొప్ప మానవతావాదిగానో కాదు వీటన్నింటికి మంచి రియల్ ఇండియన్ గా అబ్దుల్ కలాం తిరిగి రాని లోకాలకు ప్రయాణం ప్రారంభించారు. ప్రభుత్వ అన్ని లాంఛనాలతో అబ్దుల్ కలాం అంత్యక్రియలు ఆయన స్వంత ఊరు రామేశ్వరంలో జరిగాయి. కోట్ల మంది కన్నీటి చుక్కల మధ్య ఓ మహా మనిషి తన ప్రస్థానాన్ని ముగించుకున్నారు.

అబ్దుల్ కలాం స్మృతిలో ఓ అభిమాని రాసిన చిన్న కవిత..
 అందగాడు కాదు, ఆజానుబాహుడు కాదు.
ఐశ్య్వర్య వంతుడు అంత కన్నా కాదు...
అఖండ భారతాన్న దుర్భినితో వెతికినా
ఒక్క శత్రువు అయినా కానరాడు.
ఏమిటయ్య నీ గొప్పతనం.....మేరు చిన్నబోయె
మాకు తెలిసిన అతిలోకసుందరాగుడవు నీవు!
సిపాయి కాదు, కత్తి పట్టనూలేదు.
క్షాత్రం కనుచూపు మేరలో కానరాదు...
రాముడు కాదు రహీము కాదు...
విల్లంబులెత్తిన అర్జునుడు కాదు...
సారథి కృష్ణుడూ కాదు...శౌర్యం మాటే లేదు
అయిననూ శత్రుదేశాన్ని బయపెట్టని క్షణంలేదు!
ఓడిపోయి ఆగింది లేదు, విజయ గర్వం లేదు.
అసలు అలిసిన ఛాయలేవీ నీలో లేనేలేవు...
కూడ బెట్టింది ఏంలేదు...కలి అంటింది లేదు.
పదవీగర్వం లేదు...పురస్కార వాంఛ పుట్టుకతోలేదు.
ఉన్న ఆస్తి అంతా కూడా లక్ష్యసాధనే.
మాకు తెలిసిన మహోన్నత వ్యక్తివి నీవు!
అంపశయ్య లేదు... ఆసుపత్రి సూది మందులేదు.
జుట్టు చెదరలేదు....నీ మోము పై నవ్వు ఆగలేదు.
భవబంధాలు లేవు...బయపడింది లేదు.
ఎక్కడమ్మా ఓ మృత్యుమాత...నువ్వు గెలిచింది.
ఒక చుక్క కన్నీరు నువ్వు కూడా రాల్చి ఉంటావు...
మాకు తెలిసిందింతే...మేమంతా ప్రేమించే మహాత్ముడవు!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles