కన్నతండ్రి, సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురై సరూర్‌నగర్‌లోని గ్లోబల్ అవేర్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ప్రత్యూష ఇవాళ అసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. ఇక అమె ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి వెళ్లనుంది. ఆసుపత్రిలో చికిత్స అనంతరం అమె బాథ్యతను తాను చూసుకుంటానని సీఎం కేసీఆర్ అమెకు హామిని ఇచ్చిన నేపథ్యంలో అమె సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లనుంది. అసుపత్రి నుంచి డిశ్చార్జ్ అమెను ఎల్బీనగర్ పోలీసులు ఉమ్మడి రాష్ట్ర హైకోర్టులో హాజరుపర్చారు. దాదాపు 20 నిమిషాల పాటు ప్రత్యూషతో హైకోర్టు సీజే మాట్లాడారు. ఆ తరువాత ప్రత్యూషను తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంటికి తరలించాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు పోలీసులకు ఆదేశాలు చేసింది. ప్రత్యూష విషయంలో సీఎం కేసీఆర్ నిర్ణయం ఏమిటో తమకు తెలియజేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అదేశించారు.
అంతేగాకుండా ప్రత్యూషతో మీడియా, న్యాయవాదులు మాట్లాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా హైకోర్టు పోలీసులకు సూచించింది. హైకోర్టు ఆదేశాలతో ప్రత్యూషను పోలీసులు కేసీఆర్ నివాసానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఒళ్లంతా గాయాలతో ఆస్పత్రిలో చేరిన ప్రత్యూషను తొలుత కేసీఆర్ కుమార్తె, ఎంపీ కవిత పరామర్శించారు. ఆ తర్వాత నేరుగా కేసీఆర్ సతీసమేతంగా ఆస్పత్రికి వచ్చి ప్రత్యూష యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్యూషను చదివించడంతో పాటు పెళ్లి కూడా చేస్తానని ప్రకటించారు. ఇంతటితో ఆగకుండా ప్రత్యూషకు తన ఇంట్లోనే ఆశ్రయం కల్పిస్తానని కేసీఆర్ ప్రకటించడంతో హైకోర్టు ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more