Public Tribute to Former President APJ Abdul Kalam At His Residence in Delhi

Nation parliament and central cabinet mourns people s president abdul kalam

Public Tribute to Former President APJ Abdul Kalam At His Residence in Delhi, President, PM, Vice President pay homage to kalam, APJ Abdul Kalam, Abdul Kalam, Abdul Kalam Shillong, Abdul Kalam ICU, Abdul Kalam hospital, Abdul Kalam Dies, PM Modi tributes to modi, Narendra modi, Final journey, Pranab Mukharjee, Hameed Ansari, Abdul Kalam dies, former president dies, Rahul gandhi pays tribute to abdul kalam, 10 Rajaji Marg, palam airport

President Pranab Mukherjee, Vice President Hamid Ansari and Prime Minister Narendra Modi paid tribute to Dr Kalam at his residence

కలాం పార్థీవదేహాన్ని సందర్శించి. అంజలి ఘటించిన ప్రముఖులు

Posted: 07/28/2015 05:12 PM IST
Nation parliament and central cabinet mourns people s president abdul kalam

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆజాద్ మృతిపట్ల కేంద్ర కేబినెట్‌, పార్లమెంటు ఉభయ సభలు సంతాపం వ్యక్తం చేశాయి. కలాం సేవలను కొనియాడుతూ కేంద్ర కేబినెట్‌ తీర్మానం చేయగా, పార్లమెంటు ఉభయ సభలు ఆయన మృతికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ అంజలి ఘటించాయి. ఉభయ సభల సభ్యులందరూ రెండు నిమిషాల పాటు నిలబడి ఆయనకు నివాళులర్పించారు. ఆయన విజన్‌ను, వివేకాన్ని కోల్పోయామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. ఆ తరువాత వాయిదా పడ్డాయి.

గురువారం రామేశ్వరంలో కలాం అంత్యక్రియలు జరగనున్నట్లు కేబినెట్ తెలిపింది. కలాం మృతికి 7 రోజులు సంతాప దినాలుగా కేంద్రం ప్రకటించింది. ఢిల్లీలోని 10 రాజాజీమార్గ్‌లోగల కలాం నివాసంలో ఈరోజు మధ్యాహ్నం నుంచి రెండు గంటల పాటు కలాం పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆ తరువాత కలాం భౌతికకాయాన్ని ఆయన జన్మస్థలం రామేశ్వరానికి తరలిస్తామని కేంద్రమంత్రి రూడీ తెలిపారు. అంతకుముందు బీజేపీ పార్లమెంట్‌ సమావేశంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. సభ్యులంతా రెండు నిమిషాలు మౌనం పాటించారు. కలాం మరణంతో భారతదేశం తన రత్నాన్ని కోల్పోయిందని ఈ సందర్భంగా మోదీ అన్నారు. అబ్దుల్‌ కలాం ముందు దేశానికి భారతరత్నమని ఆ తరువాతే రాష్ట్రపతి అయ్యారని ప్రధాని పేర్కొన్నారు.

రాజాజీ రోడ్డులోని అబ్దుల్ కలాం నివాసంలో ఆయన పార్థీవ దేహానికి లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కాంగ్రెస్ అదినేత్రి సోనియా గాంధీ, యువనాయకుడు రాహుల్ గాంధీ, విపక్ష నేత మల్లిఖార్జున్ ఖార్గే, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండుల్కర్, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ, పలు పార్టీలకు చెందిన నాయకులు, మాజీ కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల మంత్రులు, రాజ్యసభ సభ్యులు, పార్లమెంటు సభ్యులు, పలువురు ప్రముఖులు, ఆయన బౌతిక కాయాన్ని సందర్శించి.. అంజలి ఘటించారు.

విద్యార్థుల దినోత్సవంగా కలాం జన్మదినం
 
మాజీ రాష్ట్రపతి, భారత రత్న డాక్టర్ ఏపిజే అబ్దుల్‌ కలాం మృతిపట్ల ఐక్యరాజ్య సమితి సంతాపాన్ని వ్యక్తం చేసింది. భారత జాతి అభ్యున్నతికి, ముఖ్యంగా యువ భారతావనికి ఆయన చేసిన సేవలను కోనియాడింది. శాస్త్రసాంకేతికత రంగం అభివృద్దికి ఆయన ఎనలేని కృషి చేశారని శ్లాఘించింది. అబ్దుల్ కలాం జన్మదినాన్ని(అక్టోబర్‌ 15) విద్యార్థుల దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. 1931 అక్టోబర్‌ 15న కలాం రామేశ్వరంలో జన్మించారు. నిన్న(సోమవారం) సాయంత్రం షిల్లాంగ్‌ ఐఐఎంలో ప్రసంగిసిస్తూ కుప్పకూలిన కలాంను వెంటనే ఆస్పత్రికి తరలించగా కాసేపటికే తుదిశ్వాస విడిచారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : APJ Abdul Kalam  Narendra modi  Final journey  Pranab Mukharjee  Hameed Ansari  

Other Articles