Rahul gandhi | AP | Special status |YSRCP | BJP, Congress, TDP, CHandrababu naidu, AICC

Rahul gandhi do you have the answers for this questions

Rahul gandhi, AP, Special status, YSRCP, BJP, Congress, TDP, CHandrababu naidu, AICC

Rahul gandhi do you have the answers for this questions. Rahul Gandhi slams TDP, BJP and YSRCP on his ANantapur tour.

ITEMVIDEOS: ఏపికి చేసిన పాపంలో రాహుల్ కు వాటా.. మరి లేదంటావే..?

Posted: 07/25/2015 12:11 PM IST
Rahul gandhi do you have the answers for this questions

రాహుల్ గాంధీ అనంతపురం పర్యటనలో భాగంగా అన్ని పక్షాలను ఉతికి ఆరేశారు. నిజాయితీకి మారు పేరు, మాటకు కట్టుబడి ఉండే పార్టీ, ప్రభుత్వం అంటే మాదే, అధికారం అంటే మేమే చెయ్యాలి అన్నట్లుగా రాహుల్ ఊకదంపుడు ఉపన్యాసం చేశారు. అటు టిడిపి, బిజెపిలతో పాటు వైసీపీలను కూడా విమర్శలల్లో ముంచారు. ఏపి ప్రజలకు తాము అండగా ఉంటాం అన్నట్లు మాట్లాడిన రాహుల్ చాలా విషయాలను మరిచిపోయినట్లు కనిపించింది. ఎందుకంటే రాహుల్ మాటల్లో పాపం మొత్తం మోదీ సర్కార్ దే అన్నట్లు, చేతగాని టిడిపి నేతల నిర్వాకం అంటూ చిలుకపలుకులు పలికారు. అయినా పక్కవాడి మీద వేలెత్తి చూపాలంటే ముందు తమ తప్పులు తెలుసుకోవాలి అన్న వేమన గారి మాట రాహుల్ గాంధీకి తెలుసోలేదో. అయినా రాహుల్ గాంధీ కూడా ఏపికి అన్యాయం చేసిన బ్యాచ్ లో మెంబరే మరి ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అంటే అందరికి అర్థమవుతుంది.

రాహుల్ వీటికి సమాధానాలు ఉన్నాయా...

* ఏపి విభజన బిల్లును అమలు చెయ్యడం లేదు అని ప్రశ్నిస్తున్నారు. మరి మీరు పార్లమెంట్ లో దీని మీద మాట్లాడటానికి ప్రయత్నం చేశారా..?
* ఏపికి అసలు అన్యాయం జరిగింది అంటున్నారు కానీ ఎవరు చేశారు..?
* విభజన బిల్లును చెత్త కుప్పలాగా.. అసంపూర్తిగీ తీసుకువచ్చింది మీ ప్రభుత్వం కాదా..?
* మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ప్రత్యేక హోదా ప్రకటిస్తూ బిల్ తీసుకురావచ్చు కదా..? అలా ఎందుకు చెయ్యలేదు..?
* ఏపి ఏర్పడి ఏడాది దాటిపోయింది. మరి ఇప్పుడు ఎందుకు ఏఫి మీద ఇంత ప్రేమ పొంగుకువచ్చింది. ?
*  బిజెపిని, టిడిపిని, వైసీపి ఎత్తిపోడుస్తున్నారుగా మరి మీ పార్టీ, మీ నాయకులు పొడిచింది ఏమిటి..?
* తెలుగు వారికి అన్యాయం చేసిన పాపంలో మీ వాటా కూడా లేంటారా..?
* ఇప్పుడు వచ్చి చిలుక పలుకులు పలికితే అంతా సర్దుబాటు అవుతుందని మీరు భావిస్తున్నారా..?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul gandhi  AP  Special status  YSRCP  BJP  Congress  TDP  CHandrababu naidu  AICC  

Other Articles