b-tech student gang raped in guise of party by three youth

Gang rape on b tech student at vanasthalipuram

b-tech student gang raped in hyderabad, co-students gang raped b-tech student, gang rape in telangana, vanasthalipuram, rape, gang rape, gang rape on b-tech student, violence against women, crime against women, harrassment against women, b-tech student gang raped, hyderabad crime news, vanasthalipuram crime news,

b-tech student gang raped in guise of party by three co students at vanasthalipuram in hyderabad

సహవిద్యార్థులే తోడేళ్లై.. బి టెక్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్..

Posted: 07/23/2015 04:05 PM IST
Gang rape on b tech student at vanasthalipuram

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచారం తరువాత అమె పేరుతో కఠిన చట్టాలు అమల్లోకి వచ్చినా.. ఇంకా దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలో ప్రతి రోజు చోటుచేసుకుంటున్నాయి. అత్యాచార కేసులను వేగవంతంగా విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసినా.. ఈ తరహా నేరాల సంఖ్య మాత్రం రోజురోజుకు అంతకంతకూ పెరుగుతూనే వుంది. తాంబులాలిచ్చాం. తనుక్కు చావండి అన్నట్లుగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను చేశాం. కఠినంగా అమలు పరుస్తామన్న హామీలన్ని నీటి మీద రాతలుగానే మారుతున్నాయి.

సార్వత్రిక ఎన్నికలలో సామూహిత అత్యాచారాలను, అత్యాచారాలను, మహిళలకు రక్షణ అంశాలను కూడా ప్రాతిపదిక చేసుకుని వ్రచారం చేసి.. అధికారంలోకి వచ్చిన పార్టీలు.. ప్రభుత్వాలను ఏర్పాటు చేసినా.. మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాల సంఖ్యమాత్రం ఏ మాత్రం దిగిరావడం లేదు. నేరాలు జరిగిన తరువాత నేరస్థులకు శిక్ష పడేలా చేయడం కన్నా.. నేరాలు చేయడానికే బయపడే లాంటి శిక్షలు అమలులోకి రావాలి, లేదా.. మన ఆడపడచులు అన్న భావన మగవారిలో వచ్చేలా చేయడంతోనే ఈ సమస్య కు పరిష్కారం లభించనుంది.

తాజాగా, వనస్థలిపురంలో మరో యువతి దారుణ గ్యాంగ్ రేప్ కు గురైంది. బి టెక్ చదువుతున్న విద్యార్థినిపై అమె సహ విద్యార్థులే సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వనస్థలిపురంలోని కుసుమానగర్ ప్రాంతంలో నివసిస్తున్న వెలుగుచూసింది. తొడేళ్ల వంటి సహ విద్యార్థులు బి టెక్ దదువుతున్న విద్యార్థినిపై ఈ నెల 15న పార్టీ పేరుతో ఇంటికి పిలిచి అమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు సహ విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిపై కేను నమోదు చేయగా, పరారీలో వున్న మరో విద్యార్థి కోసం గాలిస్తున్నారు. వనస్థలిపురంలో ముగ్గురు యవకులు ఓ యువతిపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. పార్టీ చేసుకుందామని ఇంటికి పిలిచి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. బాధితురాలు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరిని అదుపోలోకి తీసుకున్నట్లు సమాచారం. మరొకడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : b-tech student  gang rape  co-students  vanasthalipuram  

Other Articles