TDP | TDP leaders | Talasani Srinivas | Governor, Speaker, Telangana

Telangana telugudesam party leaders are very happy

TDP, TDP leaders, Talasani Srinivas, Governor, Speaker, Telangana

Telangana Telugudesam party leaders are very happy. Speaker said that he will take a decision on Talasani Srinivas Yadav.

ఫుల్ జోష్ లో తెలుగు తమ్ముళ్లు

Posted: 07/23/2015 04:44 PM IST
Telangana telugudesam party leaders are very happy

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తెలంగాణ టిడిపి పోరాటానికి తొలి సక్సెస్ లభించింది. మంత్రి తలసాని రాజీనామాపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాని స్పీకర్ ఇచ్చిన హామీతో ... విజయం దక్కినట్లే అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఓవైపు రాజ్యాంగబద్దంగా పోరాడుతూనే.... మరోవైపు న్యాయపోరాటం చేసిన టి-టిడిపి నాయకులు... ఆందోళనలు.. అరెస్టులతో ఇష్యూని వేడిక్కించారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో 15 నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంది తెలుగుదేశం పార్టీ. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో గ్రేటర్ హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా వున్న తలసాని శ్రీనివాసయాదవ్ తో పాటు, టి-టిడిపికి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ... అధికార టిఆర్ ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్ ను ... ఏకంగా తన కేబినెట్ లోకి తీసుకున్నారు గులాబి దళపతి కేసీఆర్.

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని ఆందోళన బాట పట్టింది టి-టిడిపి . తమ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను... అధికార పార్టీలో ఎలా చేర్చుకుంటారని నేతలు ప్రశ్నించారు. టిడిపి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ కు మంత్రి పదవి ఇవ్వటంపై స్పీకర్ తోపాటు, కోర్టును ఆశ్రయించారు. ఆరు నెలల కాలంలో ఏకంగా ఐదుసార్లు గవర్నర్ కు, మరో ఐదు సార్లు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. అయితే మంత్రిని బర్తరఫ్ చేసే విషయంలో కాని, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయటంలో కానీ స్పష్టమైన హామీ టిడిపి నేతలకు లభించలేదు.

చివరి ప్రయత్నంగా గవర్నర్ బంగ్లా ఎదుట ఆందోళనకు దిగారు టీడీపీ నేతలు. అటు స్పీకర్ ఇంటి ముందు ఆందోళనకు సిద్ధమయ్యారు. అయితే తాను టీఆర్ఎస్ లో చేరిన రోజే రాజీనామా చేశానని ప్రకటించారు మంత్రి తలసాని. రిజైన్ లెటర్ కూడా చూపించారు. ఈ ప్రకటనతో ఇరుకునపడ్డ అసెంబ్లీ స్పీకర్... తలసాని రాజీనామాపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానంటూ టిడిపి నేతలకు హామీ ఇచ్చారు. దీంతో తలసాని ఇష్యూని పక్కన బెట్టిన నేతలు... ఇక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై పోరాటం కొనసాగిస్తామంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  TDP leaders  Talasani Srinivas  Governor  Speaker  Telangana  

Other Articles