lagadapati | KCR | Godavari Pushkaralu | Karimnagar, Telangana, BIfercation of ap, Lagadapati Rajagopal

Lagadapati lauds kcr and ts govt

lagadapati, KCR, Godavari Pushkaralu, Karimnagar, Telangana, BIfercation of ap, Lagadapati Rajagopal

Lagadapati lauds KCR and TS govt. Former MP and a strong opponent of Telangana State, Lagadapati Rajagopal lauded the Telangana government for making elaborate arrangements for Godavari Pushkaralu in the newly formed State. Rajagopal, along with his family members, visited Kaleshwaram temple and took a holy dip in Godavari River

కేసీఆర్ ను మెచ్చుకున్న లగడపాటి

Posted: 07/20/2015 09:16 AM IST
Lagadapati lauds kcr and ts govt

గోదావరి మహా పుష్కరాలలో పుష్కర స్నానం చేసి తరించడానికి ఎన్నో లక్షల మంది భక్తులు వస్తున్నారు. అయితే కరీంనగర్ కు వచ్చిన ఓ వ్యక్తిని చూసి మాత్రం అందరు ఆశ్చర్యనపోయారు. మీడియా వాళ్లయితే ఆ చుట్టూనే తిరుగుతూ కూర్చున్నారు. అయితే ఎందుకు ..? ఎవరు..? అని మీకు డౌట్ వస్తుంటుంది. అయితే ా వ్యక్తి ఎవరో కాదు రాష్ట్ర విభజన సమయంలో తెగ హడావిడి చేసి.. శపథం చేసిన లగడసాటి రాజగోపాల్. అవును అయితే కరీంనగర్ లో ఆయన పుష్కరస్నానం చెయ్యడం ఒక్కటే కాకుండా కేసీఆర్ ను మెచ్చుకున్నారు. అవును మీరు చదువుతున్నది నిజమే.. లగడపాటి కేసీఆర్ ను మెచ్చుకున్నారు.

పవిత్ర గోదావరి నది తెలుగవారినందరినీ ఒకటిగా కలపాలని, రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. కొత్త రాష్ట్రమైనా తెలంగాణలో పుష్కర ఏర్పాట్లు బాగున్నాయని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో ఏర్పాట్లు చేయించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. కరీంనగర్‌ జిల్లా మంథనిలో కుటుంబసభ్యులతో కలిసి ఆయన పుష్కర స్నానమాచరించారు. కాళేశ్వరంలో పుష్కర స్నానం చేశారు. త్రిలింగ క్షేత్రాల్లో, త్రివేణి సంగమాల్లో ఒక్కటైన శ్రీ కాళేశ్వర క్షేత్రాన్ని దర్శించుకొవాలని మూడేళ్లుగా అనుకుంటున్నప్పటికీ ప్రత్యేక పరిస్థితుల వల్ల రాలేకపోయానన్నారు. మొత్తానికి గోదారమ్మ కలిపింది ఇద్దరినీ అంటూ కొంత మంది విమర్శకులు అంటున్నారు. విభజన జరిగితే తెలంగాణలో కనీసం కాలు కూడా పెట్టనని అన్న లగడపాటి.. మొత్తానికి గోదావరి మహా పుష్కరాల నేపథ్యంలో తెలంగాణలోనే పుష్కర స్నానం చెయ్యడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lagadapati  KCR  Godavari Pushkaralu  Karimnagar  Telangana  BIfercation of ap  Lagadapati Rajagopal  

Other Articles