J&K: Youths clash with security forces; Pakistan, LeT, ISIS flags waved

Jammu kashmir pakistan isis flags waved in srinagar

Jammu & Kashmir: Pakistan, Isis Flags Waved in Srinagar, J&K: Youths clash with security forces; Pakistan, LeT, ISIS flags waved, j&k clashes, kashmir clashes, pakistan flags waved, jk pakistan flags, jk isis flags, isis india, india news, j&k news, kashmir news, jammu news

A clash broke out between the police and protesters in Srinagar on Friday after flags of Pakistan and Islamic State (Isis) were waved in the capital of Jammu

శ్రీనగర్ లో మరోమారు పాకిస్తాన్, ఐఎస్ఐఎస్ జెండాల కలకలం

Posted: 07/17/2015 08:42 PM IST
Jammu kashmir pakistan isis flags waved in srinagar

జమ్మూకాశ్మీర్‌లో ప్రధాని నరేంద్రమోడీ పర్యటన సందర్భాంగా వేర్పాటు వాదులు రెచ్చిపోయారు. పవిత్ర రంజాన్ మాసంలో చివరి శుక్రవారం కావడంతో శ్రీనగర్లో భారీ ఎత్తున ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం పెద్ద సంఖ్యలో ముఖాలకు మాస్క్ లను అడ్డుగా పెట్టుకున్న యువత ఐఎస్ఐఎస్ జెండాలను, పాకిస్థాన్ జెండాలను ప్రధర్శించారు. అనంతరం వేర్పాటువాదుల ర్యాలీ నిర్వహించారు. వేర్పాటు వాదుల ర్యాలీ, ఉగ్రవాద, పాకిస్థాన్ జెండాలను ఎగురవేయడంతో జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో ఉద్రిక్తతలు తలెత్తాయి.
 
ర్యాలీలో ముఖాలకు ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు పాకిస్థాన్, ఐఎస్ఐఎస్ జెండాలను చేతబట్టి.. పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. కానీ వేర్పాటు వాదులు రెచ్చిపోయారు. పోలీసులపై రాళ్లు రువ్వుతూ.. ఉద్రిక్త పరిస్థితులను తలెత్తేలా చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. అయినా వినని ఆందోళన కారులు పోలీసులతో సవాల్ విసిరే స్థాయిలో రాళ్ల వర్షం కురిపించారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
 
కాగా జమ్మూకాశ్మీర్‌లో ఐసిస్‌ జెండాలు ఎగురవేయడం శ్రీనగర్ ప్రాంత ప్రజల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. అసలే వేర్పాటువాదుల గోల, మరోవైపు పాకిస్థాన్ తీవ్రవాదులతో ఇబ్బందులు పడే జమ్మూకాశ్మీర్ ప్రజలకు ఐసిస్ ప్రభావం కనిపించడం ఆవేదనను మిగిల్చింది. గతంలో పలు పర్యాయాలు ఇదే పరిస్థితులు ఉత్పన్నమైనా.. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో కూడా మరోమారు ఉగ్రవాద జెండాలు ఎగరడంపై విపక్షాలు విమర్శలను గుప్పించాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jammu & Kashmir  :pakistan flags  jk isis flags  india  

Other Articles