rogue murdered by pivot priest for forcing to booze

Pivot priest killed rogue at gandipet

pivot priest killed Rogue at gandipet, rogue murdered by pivot priest for forcing to booze, gandipet crime news, crime in gandipet, crime in Rangareddy, crime in telangana, crime news, rogue, rogue murdered, pivot priest, mahesh kumar vyas, pavan kumar joshi

A pivot priest murdered his relative with a hammer, who was a rogue, and forcing him to booze all the time

మద్యం మత్తు.. జీవితాన్నే బలిగోనింది..

Posted: 07/16/2015 09:19 PM IST
Pivot priest killed rogue at gandipet

మద్యం మత్తు.. బంగారం లాంటి జీవితాన్ని బలి తీసుకుంది. మద్యం మత్తులో పడి జులాయిగా తిరుగుతున్న ఆ యువకుడిని కుటుంబం వెలివేసింది. నిత్యం మద్యం సేవించడానికి డబ్బులు ఇవ్వాలని వేధిస్తుండటంతో తమ ఇంట్లోకి కూడా రానీయకుండా చర్యలు తీసుకున్నా అతనిలో మార్పు రాలేదు. చివరకు అదే మద్యం అలవాటు ఏకంగా అతని ప్రాణాలు బలిగోనింది. 14 నెలలుగా ఆచూకీ లేకుండా పోయిన మహేశ్‌కుమార్‌ వ్యాస్‌ కోసం.. కొంతమంది ఆరా తీయగా గండిపేటలోని హనుమాన్‌ ఆలయం పక్కన బుధవారం ఆయన మృతదేహం కనిపించింది. నిందితుడు ఆ ఆలయం పూజారి పవన్‌కుమార్‌ జోషి అని గుర్తించారు.

స్థానికుల కథనం ప్రకారం, జులాయిగా తిరుగుతూ, మందు కోసం వేధిస్తున్న వ్యాస్‌ను ఆయన కుటుంబం మూడేళ్ల క్రితం ఇంటి నుంచి గెంటి వేయగా.. మేనమామ ఇంటికి చేరాడు. ఆయన కుమారుడు పవన్‌కుమార్‌ జోషి కూడా మందుకు బానిస కావడంతో వ్యాస్‌కు దోస్తీ కుదిరింది. కొంతకాలం బాగానే సాగినా మద్యం కోసం వ్యాస్‌...జోషిని వేధించేవాడు. తట్టుకోలేని స్థితిలో.. సుత్తితో బలంగా తలపై కొట్టడంతో..వ్యాస్‌ చనిపోయాడు. రెండో కంటికి తెలియకుండా ఆలయం పక్కనే ఉన్న సంప్‌ హౌస్‌లో పూడ్చి పెట్టాడు.

ప్రతి రోజు ఉదయం మద్యంషాపు తెరవకుండానే అక్కడికి వచ్చి బోణి చేసే మహేష్ కుమార్ వ్యాస్‌ గత కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన మద్యం షాపు వాళ్లు మహేష్ కోసం కూపి లాగారు. ప్రతి రోజు వ్యాస్ తో కలసి జంటగా వచ్చే జోషి ఒక్కడే వస్తుండటంతో షాపులోని వారికి అనుమానం వచ్చింది. నిషా తలకెక్కిన స్థితిలో ‘నేను వ్యాస్‌ను చంపేశాను’ అని జోషి ఒప్పుకొన్నాడు. అతనిచ్చిన వివరాలు ప్రకారం తవ్వకాలు జరపగా.. అస్తిపంజరాలు బయటపడ్డాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. జోషిని అదుపులోకి తీసుకొన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rogue  pivot priest  mahesh kumar vyas  pavan kumar joshi  crime news  

Other Articles