Army | truck | Jawans | Maharastra | Soldiers

Army jawans dont need a crane to lift truck and save persons life

Army, truck, Jawans, Maharastra, Soldiers

Army jawans dont need a crane to lift truck and save persons life Army jawans don't need a crane to lift truck and save person's life. A bus full of army personnel was going by when they saw a person stuck under a truck in an accident. The army men did not wait for a crane to help them but lifted the truck themselves and saved the guy.

ITEMVIDEOS: ఆ ట్రక్కును ఎత్తి.. ప్రాణాలు కాపాడిన ఆర్మీవాళ్లు

Posted: 07/16/2015 04:08 PM IST
Army jawans dont need a crane to lift truck and save persons life

ఇండియన్ ఆర్మీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెరికల్లాంటి సైనికులు భారతదేశ రక్షణలో ఎంతో కీలకంగా వ్వవహరిస్తుంటారు. అయితే ఆర్మలో పని చేస్తున్న వారు సామాజిక  బాధ్యతతో మెలుగుతారు. కంటి ముందు ఏదైనా తప్పు జరిగితే అస్సలు సహించరు. కళ్లెదుట ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే స్పందిస్తారు. డేరింగ్ అండ్ డ్యాషింగ్ అనే పదానికి కేరాఫ్ ఆర్మీ వాళ్లే. తాజాగా జరిగిన ఓ ఘటన వారి మనోదైర్ఘ్యాన్ని మరోసారి నిరూపించింది. మామూలు వ్యక్తులు చెయ్యలేము అనుకున్న పనిని అతి సునాయాసం చేసి చూపించారు సైనికులు.

మహారాష్ట్రలోని రాహురి సమీపంలోని షిర్డీ రోడ్డు మీద ఒక భారీ వాహనం తలకిందుల పడిపోయింది. ఆ భారీ వాహనంలో ఒక వ్యక్తి ఇరుక్కుపోయాడు. సాయం కోసం అరుస్తున్నాడు. అటువైపు వెళ్తున్నవారు ఆగి.. చూస్తున్నారే తప్పించి.. ఏం చేయాలో తోచని పరిస్థతి. ఇంతలో.. ఆ దారి వెంటే ఒక ఆర్మీ వాహనం వెళుతోంది. అందులో ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్నారు. భారీ వాహనం బోల్తా పడటం గమనించిన వారు తాము ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆపేసి.. కిందకు దిగారు.

పరిస్థితి పరిశీలించారు. వెంటనే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకున్న వారు.. ప్రమాదంలో ఉన్న వ్యక్తిని రక్షించేందుకు ప్లాన్ సిద్ధం చేశారు. భారీ వాహనాలు అడ్డదిడ్డంగా పడిపోతే.. వాటిని తీసేందుకు భారీ క్రేన్ లు ఉపయోగిస్తుంటారు. అలాంటివేమీ లేకున్నా.. పెద్దగా ఆలోచించని ఆర్మీజవాన్లు.. ఒట్టి చేతలతో అంత పెద్ద వాహనాన్ని అవలీలగా ఎత్తేసి నిలబెట్టేశారు. ఆ వాహనంలోఇరుక్కున్న వ్యక్తిని కాపాడారు. ఈ మొత్తం ఘటనను చూస్తున్న వారంతా ఆర్మీవాళ్ల సాహసాన్ని అభినందించకుండా ఉండలేకపోయారు. ఆర్మీవోళ్లు.. ఆర్మీవోళ్లే అంటూ ప్రశంసల వర్షం కురిసింది.

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Army  truck  Jawans  Maharastra  Soldiers  

Other Articles