lawyer veeraraghava reddy filed complaint on chandrababu naidu in NHRC over pushkar ghat incident

Lawyer veeraraghava reddy filed complaint on chandrababu naidu in nhrc

pushkar ghat incident, chandrababu naidu, nhrc, lawyer filed complaint on babu, pushkar ghat controversy, rajahmundry pushkar ghat, chandrababu controversy

lawyer veera raghavareddy filed complaint on chandrababu naidu in NHRC : lawyer veeraraghava reddy filed complaint on chandrababu naidu in NHRC over pushkar ghat incident.

పుష్కర తొక్కిసలాట ఘటనపై ఎన్.హెచ్.ఆర్.సీ లో చంద్రబాబుపై పిర్యాదు

Posted: 07/14/2015 06:37 PM IST
Lawyer veeraraghava reddy filed complaint on chandrababu naidu in nhrc

అంగరంగ వైభవంగా ప్రారంభమైన గోదావరి మహా పుష్కరాల్లో మహా విషాదం చోటు చేసుకున్న ఘటనపై ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపైనే జాతీయ మానవ హక్కుల సంఘానికి పిర్యాదు వెళ్లింది. ఈ పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలోని కోటగుమ్మం వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటలో మృతుల సంఖ్య అమాంతం పెరుగుతూనే వుంది. ఘటన జరిగిన తరువాత 15 మంది అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయారు, ఆ తరువాత ఆసుపత్రులలో చికిత్స పోందుతూన్న వారు మరణించడంతో క్రమంగా ఘటన మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ప్రభుత్వ లెక్కల ప్రకారం 32 మంది దుర్మరణం పాలయ్యారు.

ఏపీ ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాట్లు చేసినప్పటికీ.. ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో సీఎం చంద్రబాబుపై విపక్ష నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పుష్కరాలకు తగిన ఏర్పాటు చేయలేదని, ఆయన నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని.. ఘటనకు ఆయన ప్రభుత్వ వైఫల్యమే కారణమని, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓవైపు బాబుపై ఈ విమర్శలపపర్వం కొనసాగుతుండగానే ఆయనపై జాతీయ మానవ హక్కుల సంఘంలో పిర్యాదు కూడా అందింది.

పుష్కరాల్లో చోటు చేసుకున్న ఘటనకు చంద్రబాబే కారణమంటూ వీరరాఘవరెడ్డి అనే న్యాయవాది ఆయనపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్.హెచ్.ఆర్.సి)లో ఫిర్యాదు చేశారు. పుష్కరాలకు బాబు తగిన ఏర్పాటు చేయలేదని, తొక్కిసలాట ఘటన చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవడంలో ఏపీ సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఈ ఫిర్యాదును ఎన్.హెచ్.ఆర్.సి విచారణకు స్వీకరించింది. ఇప్పటికే ‘ఓటుకు నోటు’, ‘ఫోన్ ట్యాపింగ్’ వంటి వ్యవహారాలతో తలమునకలైపోతున్న చంద్రబాబుకు తాజాగా పుష్కరాల ఘటన మరింత ఆందోళనల్లో ముంచేసింది. ప్రస్తుతం బాబు పరిస్థితి చూస్తుంటే.. ‘అదృష్టం వచ్చి బాబుకు షేక్ హ్యాండ్ ఇచ్చే లోపే పుష్కరాల ఘటన రూపంలో దురదృష్టం వచ్చి లిప్ కిస్ ఇచ్చినట్లు’ వుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pushkar ghat incident  chadnrababu naidu  nhrc  

Other Articles