tamilnadu cm jayalalitha issued defamation suit to rediff website for create fake news on her health

Tamilnadu cm jayalalitha issued defamation suit to rediff website

jayalalitha, tamilnadu cm, rediff website, jayalalitha defamation suit, rediff website defamation suit, jayalalitha health controversy, tamilnadu politics, tamilnadu latest updates, jayalalitha updates, jayalalitha rediff controversy

tamilnadu cm jayalalitha issued defamation suit to rediff website : tamilnadu cm jayalalitha issued defamation suit to rediff website for create fake news on her health.

‘రిడీఫ్.కామ్’పై తమిళ తలైవి కన్నెర్ర.. పరువు నష్టం దావా

Posted: 07/14/2015 05:32 PM IST
Tamilnadu cm jayalalitha issued defamation suit to rediff website

మెరుగైన సమాచారాన్ని అందించే టాప్ వెబ్ సైట్లలో ఒకటైన ‘రిడీఫ్.కామ్’ వెబ్ సైట్.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వ్యవహారంలో నిరాధార కథనాలు రాసి ఆమె ఆగ్రహానికి గురైంది. ఇటీవలే జయలలిత ఆరోగ్య పరిస్థితి బాగోలేదని వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే! ఈ వార్తను మొదట ప్రచారం చేసింది ఆ వెబ్ సైటే! అయితే.. ఈ వార్తల్లో ఎటువంటి వాస్తవాలు లేవని చెప్పిన జయ.. తన ఆరోగ్యంపై నిరాధార కథనాలు ప్రచురించినందుకు ఆ వెబ్ సైట్ కు నోటిసులు పంపారు.

చెన్నైలోని ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో జయ తరఫున న్యాయవాది ఎంఎల్ జెగన్ క్రిమినల్ ఫిర్యాదు చేశారు. చెన్నై మీడియా ఎలాంటి వాస్తవలు ధ్రువీకరించుకోకుండానే, తన పాపులారిటీని దిగజార్చాలన్న ఉద్దేశంతో.. ‘న్యూ జయలలితాస్ హెల్త్ ఈజ్ నాట్ ఫైనన్, బట్ కెప్ట్ మమ్’ అన్న టైటిల్ తో తన ఆరోగ్యపరిస్థితులపై నిరాధారమైన ఆర్టికల్ రాసినట్లు జయ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఆర్టికల్ ప్రచారమైన వెంటనే తమిళనాట ‘జయకు ఏమైంది..?’ అన్న అంశంతో జోరుగా చర్చలు జరిగాయి. పైగా.. జయలలిత కొన్నాళ్ల నుంచి మీడియా ముందుకు అంతగా రానిపక్షంలో ఈ అబద్ధపు ప్రచారాలకు మరింత బలపడింది. దీంతో ఈ వార్త తమిళనాడులో పెద్ద సంచలనంగా మారింది. ఈ వార్తను తెలుసుకున్న జయ.. తనపై అసత్య ప్రచారాన్ని సృష్టించిన ‘రిడీఫ్.కామ్’ వెబ్ సైట్ పై పరువునష్టం దావా వేశారు.

ఇదిలావుండగా.. జయలలిత ఆరోగ్య విషయమై వచ్చిన ఆ ఆర్టికల్ బాగా ప్రచారమైన అనంతరం తమిళనాడు రాజకీయాల్లో పెద్దయెత్తున చర్చలు జరిగాయి. జయ ఆరోగ్య పరిస్థితి బహిర్గతం చేయాలంటూ టీఎన్సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ తోపాటు పలువురు నాయకులు సైతం డిమాండ్ కూడా చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayalalitha  rediff website  fake news  

Other Articles